Pan Aadhar link: ముంచుకొస్తున్న గడువు.. ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే ఇక అంతే..!

దేశంలోని పౌరులందరికీ అత్యంత అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రధానమైనవి. ఆధార్ కార్డుతో పౌరుడిగా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి అవసరమవుతుంది. ఈ కార్డు లేకపోతే ఒక్క పనికూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కూడా ఆర్థిక లావాదేవీలకు చాలా ముఖ్యమైంది.

Pan Aadhar link: ముంచుకొస్తున్న గడువు.. ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే ఇక అంతే..!
Follow us
Srinu

|

Updated on: Nov 30, 2024 | 12:13 PM

ఆదాయపు పన్ను కట్టేవారందరూ తప్పనిసరిగా పాన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆదేశించింది. ఈ గడువు కూడా జూన్ 30తో ముగిసింది. అయితే జరిమానాతో అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేసుకునే గడువు ముగియడంతో ప్రభుత్వం డిఫాల్టర్లపై జరిమానా విధించడం ప్రారంభించింది. అనుసంధానం కాని పాన్ నంబర్లు జూలై ఒకటి నుంచి పనిచేయడం మానేశాయి. ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ ప్రకారం.. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించేవారందరూ తప్పనిసరంగా తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే వారందరూ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయలేదు.

ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరగడానికి, పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండటానికి ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం చాాలా అవసరం. ఇందుకోసం 2022 మార్చి 31 చివర తేదీ అని ఆదాయపు పన్ను శాఖ గతంలో ప్రకటించింది. అనంతరం 2023 జూన్ వరకూ గడువును పెంచింది. అప్పటికీ లింక్ చేసుకోనివారికి జరిమానా విధిస్తోంది. 2023 జూలై 1 నుంచి ఈ ప్రక్రియ చేసుకునే వారి నుంచి రూ.వెయ్యి జరిమానా కట్టించుకుంటున్నారు. జరిమానా కట్టాలని పాన్ లింక్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జరిమానా కట్టి పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చాలా సులువుగా ఈ పని చేసుకోవచ్చు. జరిమానాను చెల్లించి పాన్, ఆధార్ లను ఆన్ లైన్ లో లింక్ చేయడానికి ఈ కింద పద్దతులు పాటించాలి.

ఇవి కూడా చదవండి

ఆధార్ పాన్ లింకింగ్ ఇలా

  • ముందుగా ఆదాయపు పన్నుశాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ను సందర్శించాలి. హోమ్ పేజీలోని క్విక్ లింక్ ల విభాగంలోని లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
  • నిర్దేశిత నమూనాలో మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయాలి.
  • కంటిన్యూ టు పే త్రో ఇ-పే ట్యాక్ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • మళ్లీ మీ పాన్ నంబర్ ను ఎంటర్ చేసి, నిర్దారించండి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
  • ఆ నంబర్ ను ఎంటర్ చేయగానే ఇ-పే ట్యాక్స్ పేజీ తెరపై కనిపిస్తుంది.
  • ఇన్ కమ్ ట్యాక్స్ బటన్ పై ప్రొసీడ్ అని క్లిక్ చేసి, అసెస్ మెంట్ ఈయర్, ఇతర రశీదుల చెల్లింపు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం కొనసాగించాలి.
  • మీకు ఒక చలాన్ వస్తుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత ఇ–ఫైలింగ్ పోర్టల్ నుంచి పాన్ తో ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు.
  • ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలోని ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ అనుసంధానం వివరాలు తెలుస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి