AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 17 వేలకుపైగా వాట్సాప్ అకౌంట్లు బ్లాక్.. ఎందుకంటే

నివేదికల ప్రకారం సైబర్‌డోస్ట్ I4C, టెలికమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో ఆగ్నేయాసియాలో సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఆ తర్వాత..

కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 17 వేలకుపైగా వాట్సాప్ అకౌంట్లు బ్లాక్.. ఎందుకంటే
Whatsapp New Feature
Ranjith Muppidi
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2024 | 12:37 PM

Share

కేంద్రం 17,000 కంటే ఎక్కువ వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ ఖాతాలన్ని ఇక్కడివి కావు. ఆగ్నేయాసియాకు చెందిన హ్యాకర్లవిగా గుర్తించింది. పలువురు కేటుగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్ ఆఫర్‌లు, గేమ్‌లు, డేటింగ్ యాప్‌లు, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో ఖాతాలు తెరిచి ప్రజలను ఆకర్షిస్తూ మోసగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(I4C), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DOT) కలిసి అలాంటి వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యం

నివేదికల ప్రకారం సైబర్‌డోస్ట్ I4C, టెలికమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో ఆగ్నేయాసియాలో సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఆ తర్వాత వారి వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేశారు. సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగించిన వాటిని తొలగించి, భారతదేశ డిజిటల్ భద్రతను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు అన్నారు. మే 2024లో కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, లావోస్ వంటి సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల నుంచి సైబర్ నేరాల ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత భారత హోం మంత్రిత్వ శాఖ ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ విచారణలో భారత్‌లో 45 శాతం సైబర్ నేరాలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వ్యక్తులే చేస్తున్నారని తేలింది. దీంతో భారతీయులు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే I4C హ్యాకర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను సంపాదించవచ్చని ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రజలను ఆకర్షిస్తూ డబ్బును లాగేస్తూ మోసం చేస్తున్నారు. వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని కలుసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి వారిని ఆకర్షించడం ద్వారా డేటింగ్ యాప్‌లలో కూడా చీటింగ్ చేస్తారు. అంతే కాకుండా నకిలీ వ్యాపార వేదికల ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

తాజా ఉదంతంలో పని వెతుక్కుంటూ కంబోడియాకు పంపిస్తామంటూ భారతీయ యువకులను ప్రలోభపెట్టి డబ్బులు దండుకున్నారు. దురాశతో కంబోడియా చేరుకుని మోసపోయి నిరసన తెలిపిన భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియాలో నివసిస్తున్న ఆ పౌరులను రక్షించడానికి, వారిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు మరికొన్ని పాత కేసులు కూడా బయటపడటంతో అలాంటి వాట్సాప్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ చేశారు. దీంతోపాటు ఈ సైబర్ దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేసేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి