AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి

మరో నెలలో 2024వ సంవత్సరం ముగియనుంది. ఈ ఏడాది పెట్టుబడిదారులకు గుర్తు ఉండేలా వివిధ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో కచ్చితంగా పొదుపు బాట పట్టాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ రంగంలో పెట్టుబడితో మంచి రాబడి వస్తుందో? ఓ లుక్కేద్దాం.

Investment Tips: మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి
Investment
Nikhil
|

Updated on: Nov 29, 2024 | 3:34 PM

Share

చాలా మంది భారతీయులకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన అంశాలలో ఒకటి పన్ను ప్రణాళిక. అవును మీరు వింటున్నది నిజమే చాలా మంది భారతీయులు పన్ను చెల్లింపులను తగ్గించుకునేందుకు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఏ రకంగా పెట్టుబడి పెట్టినా పదవీ విరమణ సంవత్సరాల్లో ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేలా తగిన కార్పస్‌ను సృష్టించుకోవచ్చు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా మీ ఆర్థిక ప్రణాళికలు ఎప్పటికీ పట్టాలు తప్పకుండా చూసుకోవడానికి కొన్ని పెట్టుబడి అవసరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే రంగాల్లో పెట్టుబడితో అధిక రాబడి పొందవచ్చో? ఓసారి చూద్దాం. 

టర్మ్ ఇన్సూరెన్స్

టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని ఆర్థిక ప్రణాళికలకు పునాదిగా పరిగణిస్తారు. ఈ ప్లాన్‌లు అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడులలో ఒకటిగా ఉంటుంది. బీమా కవర్ టర్మ్ ప్లాన్‌ల ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాన్‌లు ఆదాయపు పన్ను చట్ట్టం సెక్షన్ 80సీ కింద చెల్లించిన ప్రీమియంలకు రూ.1,50,000 వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీకు లైఫ్ కవర్ అందించే ఇతర రకాల బీమా ప్లాన్‌లు ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడం మంచి ఎంపిక.

గ్యారెంటీడ్ రిటర్న్ ప్లాన్‌లు

ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తుంటే గ్యారెంటీ రిటర్న్ ప్లాన్‌లు గొప్ప ఎంపికగా నిలుస్తాయి. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలు మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి పూర్తిగా నిరోధించబడిన 7 శాతం వరకు స్థిరమైన రాబడిని అందిస్తాయి. ఈ గ్యారెంటీ రిటర్న్ ప్లాన్‌లలో చాలా వరకు జీవిత బీమాకు సంబంధించిన అదనపు షీల్డ్‌తో పాటుగా హామీతో కూడిన రాబడిని కూడా అందిస్తాయి. కాబట్టి పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే కుటుంబాన్ని రక్షించడానికి ప్లాన్‌లోని బీమా భాగం ప్రారంభమవుతుంది. 

ఇవి కూడా చదవండి

యులిప్

ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీకు అనుకూలమైన పెట్టుబడి ఎంపికని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్‌లు బీమా, పెట్టుబడికి సంబంధించిన ద్వంద్వ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ ప్లాన్‌లు కూడా పన్ను ప్రయోజనాలతో వస్తాయి. ఈక్విటీలు లేదా డెట్‌లో పెట్టుబడి పెట్టే ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

ఆరోగ్య బీమా

ఇటీవల కాలంలో వైద్య సంరక్షణకు సంబంధించిన ఖర్చులు అధికం అయ్యాయి. అయితే ఆరోగ్య బీమాతో ఈ ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. మీ ఆర్థిక భవిష్యత్‌ను అలాంటి సంఘటనల నుండి రక్షించడానికి ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి సమగ్ర ఆరోగ్య కవర్ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది అత్యవసర సమయాల్లో మీకు ప్రశాంతతను ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి