General stores: కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా? నగరాల్లో ఇక మీదట కిరాణా దుకాణాలు చూడలేమా అంటే తాజా నివేదికలు అవుననే అంటున్నాయి. క్విక్‌కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటికే దాదాపు 2 లక్షల కిరాణా దుకాణాలు మూతపడినట్లు తెలుస్తోంది. ఆర్డరు చేసిన 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకే సరుకులు తీసుకొస్తుండటంతో క్విక్ కామర్స్ సంస్థలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఆకర్ణణీయమైన ఆఫర్లు, శ్రమ లేకుండా పని పూర్తవుతుండటం వల్ల వినియోగదారులు కూడా వీటికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల్లో అమ్మకాలు తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు నివేదిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే కిరాణా దుకాణాల నుంచి దాదాపు పది వేల కోట్ల రూపాయల అమ్మకాలు క్విక్ కామర్స్ కంపెనీల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లు తగ్గించామని 46% మంది క్విక్‌కామర్స్ వినియోగదారులు వెల్లడించారు. వివిధ క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి.
క్విక్‌కామర్స్ వచ్చిన తర్వాత విక్రయాలు తగ్గాయని 67% మంది వ్యాపారులు కూడా అంటున్నారు. మరోవైపు ఈ-కామర్స్ విక్రయాలు పెరగడం, చాలామంది కొనుగోలుదారులు దూరమవ్వడంతో.. ఆ ఎఫెక్ట్ కిరాణా దుకాణాలపై పడుతోంది. దీంతో సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్‌లను కాపాడుకుంటూనే, వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ వ్యవస్థలను అందిపుచ్చుకోవడానికి దేశంలో అతిపెద్ద వస్తు తయారీ సంస్థలకు సవాలుగా మారింది. క్విక్ కామర్స్ రంగం దూసుకెళ్తుండటం స్టాకిస్ట్‌లను కూడా కలవరపెడుతోంది. అయితే క్విక్ కామర్స్ నిల్వ సామర్థ్యాలు తక్కువగా ఉండటం వల్ల స్టాకిస్ట్‌లను దాటిపోలేరని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.