Gold Price Today: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!

Gold Price Today: 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం..

Gold Price Today: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 30, 2024 | 6:29 AM

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత నాలుదైదు రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్నాయి. ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో కొనుగోలుదారులతో షాపులు బిజీగా ఉంటాయి. తాజాగా నవంబర్‌ 30న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  3. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  4. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  5. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,270 ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  7. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది.
  8. ఇక బంగారం బాటలో వెండి పయనిస్తోంది. వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ రేటు రూ.91,600 ఉంది.

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి