Tax: షేర్లను బహుమతిగా ఇవ్వడంపై ఎంత పన్ను విధిస్తారు? నిబంధనలు ఏంటి?
Shares Gifting Tax: ఈ పరిస్థితిలో రామ్‌కి ఈ షేర్లను బహుమతిగా ఇస్తే పన్ను ఉండదు. అదేవిధంగా రామ్ తండ్రి బహుమతిని స్వీకరించడానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రామ్ తండ్రి ఈ షేర్లను విక్రయించినప్పుడు,.
Shares Gifting Tax: ప్రపంచంలో బహుమతులు ఇచ్చే సంప్రదాయం పురాతన విగ్రహారాధన ఆచారాలతో ప్రారంభమైంది. పురాతన కాలం నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు ప్రజలు వివిధ రూపాల్లో బహుమతులు అందజేస్తున్నారు. మీరు షేర్లను బహుమతిగా కూడా ఇవ్వవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దానిపై కూడా ప్రభుత్వం కొంత పన్ను విధించడం సహజం. బహుమతిగా ఇచ్చిన షేర్లపై పన్ను గురించి తెలుసుకుందాం..
నిబంధనలు ఏం చెబుతున్నాయి ?
భారతీయ చట్టం ప్రకారం, మీరు ఎవరికైనా డబ్బు, స్థిరాస్తి లేదా చరాస్తులను బహుమతిగా ఇవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు స్టాక్ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన షేర్లను చట్టబద్ధంగా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. బహుమతులు ఆదాయపు పన్ను నిబంధనలకు లోబడి ఉంటాయని నిబంధనలు చెబుతున్నాయి.
పన్ను ఉందా లేదా?
షేర్ల బహుమతి రూపంలో జరిగే లావాదేవీలు ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను విధిస్తారు. బహుమతి ఇచ్చేవారికి, బహుమతి తీసుకునేవారికి వేర్వేరు నియమాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా షేర్లను బహుమతిగా ఇస్తే, దానిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మీ భర్త, భార్య లేదా మైనర్ పిల్లలకు బహుమతిగా ఇచ్చినట్లయితే, దాని నుండి వచ్చే ఆదాయం మీ ఆదాయానికి జోడిస్తారు.
ఏ పరిస్థితులలో పన్ను విధిస్తారు?
మీకు ఎవరైనా షేర్లను బహుమతిగా ఇస్తే, ఆ షేర్ల ద్రవ్య విలువ (సరైన మార్కెట్ విలువ) రూ. 50,000 వరకు ఉంటే అది పన్ను రహితంగా పరిగణిస్తారు. ఈ ధర రూ. 50,000 దాటితే పన్ను శ్లాబ్ రేట్ల ప్రకారం ఇతర ఆదాయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లు దగ్గరి బంధువు (తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి) వంటి వారి నుండి పొందినట్లయితే, అది పన్ను రహితంగా ఉంటుంది. ఇది కాకుండా, దాత వివాహం, వారసత్వం లేదా మరణం కారణంగా పొందిన షేర్లు పన్ను రహితంగా పరిగణిస్తారు. బహుమతి పొందిన వ్యక్తి షేర్లను విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.
మూలధన లాభాలు రెండు రకాలు:
దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): షేర్లను 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే, దానిని దీర్ఘకాలిక మూలధన లాభం అంటారు. ఎల్‌టీసీజీ (LTCG) కింద దీనిపై పన్ను వర్తిస్తుంది.
షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్ (STCG): 12 నెలల కంటే తక్కువ కాలం ఉంచినట్లయితే, దానిని స్వల్పకాలిక మూలధన లాభం అంటారు. ఎస్‌టీసీజీ (STCG) లాభాల కింద దీనిపై పన్ను వర్తిస్తుంది.
బహుమతిగా షేర్ల లావాదేవీలపై ఎంత పన్ను విధించబడుతుందో ఉదాహరణ ద్వారా చూద్దాం. ఫిబ్రవరి 15, 2020న రామ్ ఒక్కో కంపెనీ షేరు రూ.100 చొప్పున 2,000 షేర్లను కొనుగోలు చేశాడని అనుకుందాం.. తరువాత సెప్టెంబర్ 1, 2020న అతను ఈ షేర్లలో 1,000 తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో ఈ షేర్ల మార్కెట్ విలువ (FMV) ఒక్కో షేరుకు రూ.200. దీని తర్వాత తండ్రి ఈ 1,000 షేర్లను ఒక్కో షేరుకు రూ.400 చొప్పున మార్చి 2, 2021న విక్రయించారు. ఈ పరిస్థితిలో రామ్‌కి ఈ షేర్లను బహుమతిగా ఇస్తే పన్ను ఉండదు. అదేవిధంగా రామ్ తండ్రి బహుమతిని స్వీకరించడానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రామ్ తండ్రి ఈ షేర్లను విక్రయించినప్పుడు, అతను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీని నుండి అందుకున్న మొత్తం రూ.4,00,000 (1,000 షేర్లు × రూ.400). రామ్ ఈ షేర్లను కొనుగోలు చేసిన సమయంలో ధర ఆధారంగా కొనుగోలు ధర రూ.1,00,000 (1,000 షేర్లు × రూ.100). ఆ విధంగా దీర్ఘకాల మూలధన లాభాలు (LTCG) రూ.3,00,000కి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 112A ప్రకారం రూ.1,00,000 కంటే ఎక్కువ లాభాలపై 10% పన్ను చెల్లించాలి. అందుకే రామ్ తండ్రి రూ.20,000 (రూ.2,00,000 × 10%) పన్ను చెల్లించాలి.
ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి