AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: కొత్త ఏడాదిలో బంగారం ధరలు రికార్డ్‌ స్థాయికి చేరనున్నాయా? నిపుణులు ఏమంటున్నారు!

. ఇప్పుడు అదే స్థాయికి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. పసిడితోపాటు వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర కూడా పెరుగుతోంది. గురువారం కిలో వెండి రూ.79,500 ఉండగా, శుక్రవారం కాస్త తగ్గింపుతో రూ.78,300 లకు చేరుకుంది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర..

Gold Rates: కొత్త ఏడాదిలో బంగారం ధరలు రికార్డ్‌ స్థాయికి చేరనున్నాయా? నిపుణులు ఏమంటున్నారు!
Today Gold Price
Subhash Goud
|

Updated on: Dec 30, 2023 | 9:32 AM

Share

బంగారం ధర పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయి ధర వైపు దూసుకెళ్తోంది. రోజురోజుకీ దూకుడును కొనసాగిస్తోంది. గత కొద్దిరోజులుగా పెరుగుదలను నమోదు చేస్తూ.. ఆల్‌టైమ్‌ రికార్డ్‌ చేరుతోంది. ఫలితంగా.. కొత్త సంవత్సరం, సంక్రాంతికి బంగారం కొనుగోలు చెయ్యలేని పరిస్థితి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.63,870 ఉండగా, ఈ నెల 4 తర్వాత బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. డిసెంబర్‌ 4న తులం బంగారం 64,300 పలికింది. మళ్లీ.. ఇప్పుడు అదే స్థాయికి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. పసిడితోపాటు వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర కూడా పెరుగుతోంది. గురువారం కిలో వెండి రూ.79,500 ఉండగా, శుక్రవారం కాస్త తగ్గింపుతో రూ.78,300 లకు చేరుకుంది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 2,080 డాలర్లకు చేరుకోగా.. వెండి 24.31 డాలర్లు పలికింది. కామెక్స్‌ స్పాట్‌ గోల్డ్‌ మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

రాబోయే రోజుల్లో ధర మరింత పెంపు:

ఇక రాబోయే రోజుల్లో గోల్డ్‌ రేట్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు జ్యూయలరీ షాపు నిర్వాహకులు. గత 15, 20 రోజుల్లోనే బంగారం ధర మూడు వేలు పెరిగిందని చెప్పారు. అమెరికాలో నిరుద్యోగుల డేటా విడుదల కానుండడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు తమ పెట్టుబడులు మళ్లించినట్టు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు.. ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం పెరిగాయి. ఇక.. 2024లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. న్యూ ఇయర్‌లో పది గ్రాముల బంగారం ధర 64 వేల నుంచి 67 వేల రూపాయల మార్క్‌ను టచ్‌ చేసే ఛాన్స్‌ ఉందంటున్నారు నిపుణులు. మొత్తంగా.. బంగారం ధర వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది.

ఇవి కూడా చదవండి

టచ్‌ చేసి చూడు అంటూ ఛాలెంజ్ చేస్తోంది పుత్తడి. బంగారం ధర రికార్డు స్థాయిని చేరుకునే అవకాశం ఉందంటోంది. డిసెంబర్‌లోనే వరుసగా రెండో సారి తులం బంగారం ధర 64,300 రూపాయలను టచ్‌ చేయడంతో కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం