Savings Scheme: కొత్త ఏడాది ముందు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ పథకాలపై వడ్డీ రేట్ల పెంపు
కొత్త సంవత్సరంలో ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల నుంచి సుకన్య సమృద్ధి యోజన వరకు వడ్డీ రేట్లను మార్చింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. 3 సంవత్సరాల పొదుపు పథకంపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు 0.2% పెరిగింది. ఇప్పుడు జనవరి-మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. PPF, SSY, SCSS, KVP వంటి చిన్న..
మీరు కూడా చిన్న పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు శుభవార్త. వాస్తవానికి కొత్త సంవత్సరానికి ముందు చిన్న పొదుపు పథకం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పెద్ద బహుమతిని ఇచ్చింది. ఏడాది ముగియడానికి రెండు రోజుల ముందు ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఎంతో ఊరట లభించింది. అదే సమయంలో వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత వారు మరింత సంపాదించే అవకాశం కూడా వచ్చింది. ఏయే సేవింగ్స్ స్కీమ్‌లపై ఎంత వడ్డీ పెరిగిందో తెలుసుకుందాం.
ఈ పథకాలపై వడ్డీ రేట్లు పెరిగాయి
కొత్త సంవత్సరంలో ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల నుంచి సుకన్య సమృద్ధి యోజన వరకు వడ్డీ రేట్లను మార్చింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. 3 సంవత్సరాల పొదుపు పథకంపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు 0.2% పెరిగింది. ఇప్పుడు జనవరి-మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. PPF, SSY, SCSS, KVP వంటి చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
మూడేళ్ల పొదుపు పథకాలపై మాత్రమే వడ్డీ రేట్లు పెంచారు. 3 సంవత్సరాల పొదుపు పథకంపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది. ఇప్పుడు దీనికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఒక సంవత్సరం పొదుపు పథకంపై 4 శాతం వడ్డీని, రెండేళ్ల పొదుపుపై 6.9 శాతం వడ్డీని, 5 సంవత్సరాల పొదుపుపై 7.5 శాతం వడ్డీని పొందుతారు. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆర్థిక పరంగా భారతదేశం అద్భుతమైన పనితీరు కొనసాగుతోంది. గతేడాది వృద్ధిరేటు 5.7 శాతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థలోని 8 రంగాల్లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదైంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లలో ఎటువంటి పెరుగుదల లేదు. అంటే పీపీఎఫ్, పెట్టుబడిదారులకు 7.1 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి పీపీఎఫ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి