Tesla: భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం.? ఎక్కడ రానుందో తెలుసా..

వచ్చే ఏడాది భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో టెస్లా తన తొలి కారు తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలో జరగనున్న వైబ్రాంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి...

Tesla: భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం.? ఎక్కడ రానుందో తెలుసా..
Tesla India
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2023 | 10:37 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు దేశాల్లో టెస్లా ప్లాంట్స్‌ను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దిగ్గజ కార్ల కంపెనీ భారత్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర కథనం బయటకు వచ్చింది.

వచ్చే ఏడాది భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో టెస్లా తన తొలి కారు తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలో జరగనున్న వైబ్రాంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైబ్రాంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు మస్క్‌ గుజరాత్‌ వస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే దేశంలోకి టెస్లా కార్లను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం- ఎలాన్​ మస్క్​ బృందం మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తొలిసిందే. తొలుతు టెస్లా తన తొలి ప్లాంట్‌ను మహారాష్ట్ర లేదా తమిళనాడులో ఏర్పాటు చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు గుజరాత్‌ను ఫైనల్‌ చేశారని సమాచారం. గుజరాత్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి రుషికేష్ పటేల్‌ ఇదే విషయమై మాట్లాడుతూ.. ఎలాన్​ మస్క్​.. గుజరాత్​లో పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నట్లు, ఒకవేళ మస్క్‌ ముందుకొస్తే గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక మస్క్‌ టెస్లా ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కార్ల ఎగుమతులకు పోర్టులు వీలుగా ఉండడమే అని తెలుస్తోంది. భారత్‌లో తయారైన కార్లను ఇతర దేశాలకు సులభంగా ఎగుమతి చేయొచ్చనే ఆలోచలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం కన్సెషనల్​ డ్యూటీని 15శాతం తగ్గిస్తే.. రెండేళ్లల్లో 2 బిలియన్​ డాలర్ల ఇన్​వెస్ట్​మెంట్​కు మస్క్‌ సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.? నిజంగానే టెస్లా భారత్‌లోకి ఎంట్రీ ఇస్తుందా.? తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన