Car Price: జనవరి 1 నుంచి ఈ కంపెనీల కార్ల ధరలు మరింత ప్రియం

జనవరి 1 నుంచి దేశంలోని పలు పెద్ద కార్ల కంపెనీలు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఈ జాబితాలో లగ్జరీ వాహనాల పేర్లు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి ఏయే కార్ల కంపెనీలు రేట్లను పెంచబోతున్నాయో తెలుసుకుందాం. ఇటీవల హోండా కార్స్ ఇండియా తన వాహనాల ధరలను కొత్త సంవత్సరం అంటే జనవరి 2023 నుండి పెంచబోతోంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు

Car Price: జనవరి 1 నుంచి ఈ కంపెనీల కార్ల ధరలు మరింత ప్రియం
Tata Cars
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2023 | 7:39 AM

2023 సంవత్సరం ముగియడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఏడాది ప్రారంభంతో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇవి సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. జనవరి 1 నుంచి దేశంలోని పలు పెద్ద కార్ల కంపెనీలు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఈ జాబితాలో లగ్జరీ వాహనాల పేర్లు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి ఏయే కార్ల కంపెనీలు రేట్లను పెంచబోతున్నాయో తెలుసుకుందాం. ఇటీవల హోండా కార్స్ ఇండియా తన వాహనాల ధరలను కొత్త సంవత్సరం అంటే జనవరి 2023 నుండి పెంచబోతోంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. దీని ప్రభావాన్ని తగ్గించడానికి జపనీస్ ఆటోమేకర్ తన మోడళ్ల ధరలను పెంచబోతోంది. హ్యుందాయ్ ఇండియా ఏ మోడల్‌పై ఎంత ధరను పెంచుతుందో ఇంకా వెల్లడించలేదు.

  1. హోండా ఇటీవల తన మైక్రో SUV ఎలివేట్‌తో దేశీయ మార్కెట్లో అత్యంత పోటీతత్వ విభాగంలోకి ప్రవేశించింది. ఇది సెప్టెంబర్‌లో రూ. 11 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
  2. టాటా – దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది.
  3. మారుతీ – పెరుగుతున్న వాహనాల ధరల కారణంగా మారుతీ కూడా కొత్త సంవత్సరం నుండి ధరలను పెంచాలని నిర్ణయించింది. సాధారణ వాహనాల ధరలు 2-3 శాతం పెరగనున్నాయి. అదే సమయంలో లగ్జరీ సెగ్మెంట్ వాహనాల ధరలు దీని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
  4. ఆడి – లగ్జరీ కార్ కంపెనీ అయిన ఆడి తన వాహనాల ధరలను కూడా పెంచబోతోంది. ఆడి 2 శాతం పెంచినట్లు ప్రకటించింది.
  5. ఇవి కూడా చదవండి
  6. మెర్సిడెస్ – ఆడితో పాటు, మెర్సిడెస్ కూడా కొత్త సంవత్సరం నుండి వాహనాల ధరలను 2 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ధరలు జనవరి 1 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది.
  7. మహీంద్రా – SUV తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. కొత్త ఏడాది ప్రారంభం ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. మహీంద్రా స్కార్పియోను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు మీరు దాని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
  8. టయోటా – టయోటా జనవరి 1 నుండి భారతదేశంలో తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ధరలను ఎంతమేరకు పెంచుతారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
  9. MG మోటార్స్ – MG మోటార్స్ వాహనాలు వచ్చే ఏడాది నుండి దేశవ్యాప్తంగా ఖరీదైనవిగా మారతాయి. తయారీ ఖర్చులు పెరగడం కారణంగా ధరలను పెంచనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి