Gold, Silver Rate: మగువలకు ఉపశమనం.. భారీగా తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Gold, Silver Price: ప్రస్తుతం వెండి ధర భారీగా తగ్గింది. అలాగే బంగారం కూడా తగ్గుముఖం పట్టింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం..

ఇక బంగారం, వెండి ధరల విషయంలో ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమనే చెప్పాలి. దేశీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌కు రెండు రోజుల లాభాలు ఆవిరవుతున్నాయి. ట్రెడింగ్లో 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 80,946 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు క్షీణించి 24,696 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3,327 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 33 డాలర్లు పెరిగి 3,294 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 37.18 డాలర్లుగా ఉంది.
ఇక వెండి ధర భారీగా తగ్గింది. కిలో సిల్వర్‌పై ఏకంగా 2000 రూపాయల వద్ద తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ. 1 లక్ష 15 వేలు ఉండగా, హైదరాబాద్, కేరళ, చెన్నైలలో మాత్రం కిలో వెండి 1 లక్ష 25 వేల వద్ద ఉంది. ఇక బంగారం విషయానికొస్తే తులం బంగారంపై 450 రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష రూపాయల వద్ద ఉంది. చాలా నగరాల్లో ఇదే ధరతో కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్
Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లను ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసా..? వీటి మధ్య తేడా ఏమిటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








