Gold, Silver Price Today: దేశంలో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Gold, Silver Price Today: బంగారానికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. జోరుగా జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి..

Gold, Silver Price Today: దేశంలో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2022 | 6:04 AM

Gold, Silver Price Today: బంగారానికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. జోరుగా జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి సీజన్‌ వచ్చిందంటే చాలు జ్యూలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా సోమవారం (జనవరి 31) దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 100 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

వెండి ధరలు:

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,200 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,200లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 61,200 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 65,500 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,500 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చోటు చేసుకుంటుండటం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణమనే చెప్పాలి. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Edible Oil: వినియోగదారులకు షాక్‌.. త్వరలో పెరగనున్న వంట నూనె ధలు..!

Flipkart Electronics Sale: నెలకు రూ.430 కడితే చాలు స్మార్ట్‌ టీవీ మీ సొంతం.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌