Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో సెలవులు ఇలా.. కొద్దిగా ప్లాన్ చేసుకోండే..

బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి.. ఏయే రోజు ఉంటుందనే విషయం ముందస్తుగా తెలుసుకుంటే..

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో సెలవులు ఇలా.. కొద్దిగా ప్లాన్ చేసుకోండే..
Bank Holidays in March 2022
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 31, 2022 | 7:34 AM

Bank Holidays in February 2022: ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు(Bank) సంబంధించిన లావాదేవీలు జరుపుతుంటారు. అయితే బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు(Bank Holidays) ఉంటాయి.. ఏయే రోజు ఉంటుందనే విషయం ముందస్తుగా తెలుసుకుంటే ఇబ్బంది లేకుండా బ్యాంకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరిలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరిలోని సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి నెలలో వైశాఖ పంచమి, గురు రవిదాస్ జయంతి నాడు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, ఫిబ్రవరి నెలలో, దేశంలోని వివిధ రాష్ట్రాలు, స్థానిక క్యాలెండర్ ప్రకారం సెలవులను నిర్ణయించంది ఆర్బీఐ. ఇలా బ్యాంకులకు మొత్తం 12 రోజులపాటు సెలవులు రానున్నాయి. అయితే ఇందులో వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి.

ఫిబ్రవరి నెలలో వచ్చే కొన్ని పండుగలు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి. అందువల్ల, బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారవచ్చు. మీరు సెలవుల జాబితాను చూసిన తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేసుకోండి.  అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్‌ ప్రకారం ఈ సెలవులు ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. అయితే ఫిబ్రవరిలో ఈ 12 రోజులు సెలవులు ఉన్నప్పటికీ నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.

ఫిబ్రవరిలో సెలవుల వివరాలు..

  • ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
  •  ఫిబ్రవరి 5- సరస్వతి పూజ, బసంత్‌ పంచమి (అగర్తల, భువనేశ్వర్‌, కోల్‌కతాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.)
  • ఫిబ్రవరి 6- ఆదివారం
  • ఫిబ్రవరి 12- రెండో శనివారం
  • ఫిబ్రవరి 13- ఆదివారం
  • ఫిబ్రవరి 15- మహ్మద్‌ హజ్రత్‌ అలీ బర్త్‌డే, ఇఫాల్‌, కాన్పూర్‌, లక్నోలలో బ్యాంకులు మూసి ఉంటాయి.)
  • ఫిబ్రవరి 16- గురు రవిదాస్‌ జయంతి (చండీగఢ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి).
  • ఫిబ్రవరి 18 – డోల్జాత్రా (కోల్‌కతాలో బ్యాంకులు మూసి ఉంటాయి).
  • ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి (ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి).
  • ఫిబ్రవరి 20- ఆదివారం
  • ఫిబ్రవరి 26- నాలుగో శనివారం
  • ఫిబ్రవరి 27: ఆదివారం

ఇవి కూడా చదవండి: CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

Viral Video: చూశారుగా.. నేనేంటో.. నా బలమేంటో.. సైలెంట్‌గా చేసి చూపించింది..