- Telugu News Photo Gallery Business photos Flipkart Electronics Sale 2022: Huge Discount Offers On Best High End Smartphones
Flipkart Electronics Sale: నెలకు రూ.430 కడితే చాలు స్మార్ట్ టీవీ మీ సొంతం.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
Flipkart Electronics Sale: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్టు కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా ఫ్లిప్‌కార్టు మరో ఆఫర్‌తో..
Updated on: Jan 30, 2022 | 6:29 AM

Flipkart Electronics Sale: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్టు కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా ఫ్లిప్‌కార్టు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్లాక్‌బస్టర్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్‌లో పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులు,డెబిట్ కార్డులపై రూ.1500 వరకు తగ్గింపు అందిస్తోంది. కనీసం రూ.5వేలకుపైగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది.

అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టీవీలు కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.అలాగే ఈ ఆఫర్‌లో భాగంగా టీవీలు కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. ప్రతి నెల తక్కువ మొత్తంలో చెల్లిస్తూ టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 36 నెలల ఈఎంఐ పెట్టుకుని కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.430 చెల్లిస్తే సరిపోతుంది. టీవీలపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరలలో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై తగ్గింపు ఆఫర్ లభిస్తోంది.




