AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా ధరల్లో ఊహించని ఛేంజ్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను ప్రకటించిన క్రమంలో ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా ధరల్లో ఊహించని ఛేంజ్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Sep 19, 2026 | 6:31 AM

Share

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మొన్నటివరకు ధరలు పడిపోగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, ఆర్ధిక అనిశ్చితి, అమెరికన్ డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత కూడా గోల్డ్ రేట్లు పెరగడం విశేషం. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 19వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

బంగారం రేట్లు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430 మధ్య ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,560 వద్ద కొనసాగుతున్నాయి.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430గా పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,560 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,430కి లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద ట్రేడవుతున్నాయి.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,710 వద్ద ట్రేడవుతున్నాయి.

వెండి ధరలు చూస్తే..

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతున్నాయి

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,50,100 పలుకుతోంది

Follow Us