AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా నాన్న ఇద్దరు భార్యలను బాగా చూసుకున్నారు.. నేను 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా

నటి వనితా విజయకుమార్ వార్తల్లో నిలవడమే కాకుండా, తన మనసులోని మాటలను అంతే ధైర్యంగా వ్యక్తపరిచే వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన వృత్తిగత, వ్యక్తిగత ప్రయాణంలోని ఎత్తుపల్లాలను, ఎదుర్కొన్న సవాళ్లను ఎంతో నిర్భయంగా పంచుకున్నారు. తన జీవితాన్ని ఒక నిరంతర పోరాటంగా అభివర్ణించిన వనిత, ఏ పరిస్థితిలోనైనా గ్రేస్‌ఫుల్‌గా ముందుకు సాగానని స్పష్టం చేశారు.

మా నాన్న ఇద్దరు భార్యలను బాగా చూసుకున్నారు.. నేను 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా
Vanitha Vijay Kumar
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2026 | 3:30 PM

Share

సినీ రంగంలో నటిగా కెరీర్ ప్రారంభించిన వనిత, ఆ తర్వాత తెర వెనుక వైపు అడుగులు వేశారు. ప్రముఖ దర్శకుడు పి. వాసు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి దాదాపు పది సినిమాలకు పనిచేశారు. ఆ అనుభవమే తనకు ఒక పెద్ద ఫిల్మ్ స్కూల్ లాగా ఉపయోగపడిందని, అక్కడ దర్శకత్వం, నటన, వివిధ సాంకేతిక విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్నానని తెలిపారు. తర్వాత ఆమె కార్పొరేట్ రంగానికి మారి మీడియా మార్కెటింగ్, బ్రాండింగ్, పీఆర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో సత్తా చాటారు. ఇండియాలోనే నంబర్ వన్ సీజీ అండ్ డీఐ కంపెనీ అయిన ‘ప్రైమ్ ఫోకస్’లో సౌత్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు డీఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) టెక్నాలజీని పరిచయం చేయడంలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించారు.

తన బాల్యం గురించి మాట్లాడుతూ… తండ్రి విజయకుమార్ తన ఇద్దరు భార్యలను సమానంగా గౌరవించారని, ఎటువంటి కలహాలు లేకుండా ఒకే ఇంట్లో ఉత్తమ స్నేహితుల్లా, అక్కాచెల్లెళ్లలా జీవించారని చెప్పారు. “నేను అరుణ్ వాళ్ళ అమ్మను ‘పెద్దమ్మ’ అని, నా సొంత తల్లిని ‘అమ్మ’ అని పిలిచేదాన్ని. మా కుటుంబంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉండేది” అని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం, కుటుంబంలో స్పష్టమైన అనుబంధాలు ఉండటం వల్ల తమకు బయటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. చిన్నతనంలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ, పెద్దయ్యాక వివాహాలు, సంబంధాల విషయంలో ఊహించని మలుపులు ఎదురయ్యాయని వనిత వివరించారు.

18-19 ఏళ్ల పిన్న వయసులోనే వివాహం జరగడం, వెంటనే తల్లి కావడం, ఆ సమయంలో కుటుంబ మద్దతు లేకపోవడంతో తీవ్ర కష్టాలను అనుభవించాల్సి వచ్చిందన్నారు. తమ కుటుంబం చాలా ఆర్థడాక్స్ కావడం, తల్లి కఠినంగా ఉండటంతో స్వేచ్ఛను కోరుకున్నానని తెలిపారు. 80ల కాలంలో తల్లిదండ్రులు పిల్లలతో అంత ఓపెన్‌గా మాట్లాడేవారు కాదని, అందుకే తాను ఇప్పుడు ఒక తల్లిగా తన పిల్లలతో స్నేహితురాలిగా ఉంటూ ప్రతీ విషయాన్ని పంచుకుంటున్నానని చెప్పారు. వివాహానికి ముందు భాగస్వామిని అర్థం చేసుకునే వెసులుబాటు అప్పట్లో లేకపోవడమే తన మొదటి పెళ్లిలో ఎదురైన సమస్యలకు కారణమని పేర్కొన్నారు. జీవితంలో సర్దుబాట్లు, రాజీలు అవసరమే, కానీ టాక్సిక్ సంబంధాలలో బంధీగా ఉండకూడదు” అనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అప్పట్లో ఈ తరహా అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది మహిళలలాగే తాను కూడా నష్టపోయానని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us