AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Bill: కరెంట్ బిల్లు పోయిందా..? మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా సింపుల్..

మీ కరెంట్ బిల్లు పోయిందా.. అయితే మీరు ఆన్ లైన్ ద్వారా సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ అవకాశం కల్పిస్తున్నాయి. మీ ఫోన్ నుంచే బిల్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం.

Power Bill: కరెంట్ బిల్లు పోయిందా..? మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా సింపుల్..
Power Bill
Venkatrao Lella
|

Updated on: Nov 09, 2026 | 3:19 PM

Share

కరెంట్ బిల్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలా సర్వీసులకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ అడ్రస్ ధృవీకరణతో పాటు అనేక పనులకు ఇది అవసరం పడుతుంది. ఆధార్ కార్డులో మీ అడ్రస్ అప్డేట్ చేసుకోవాన్నా, గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలన్నా, పాన్ కార్డుతో పాటు ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లలో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా కరెంట్ బిల్లు అడ్రస్ ప్రూఫ్ తరహాలోనే ఉపయోగపడుతుంది. దీంతో కరెంట్ బిల్లు అనేది అత్యంత ముఖ్యమైన పత్రంగా చెప్పవచ్చు. కరెంట్ బిల్లు రాగానే కొంతమంది భద్రపర్చుకుంటే.. మరికొంతమంది ఎక్కడపడితే అక్కడ పడేసి మర్చిపోతుంటారు. కొన్నిసార్లు అది కనిపించకుండా పోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో టెన్షన్ పడనక్కర్లేదు. మీరు ఆన్‌లైన్ ద్వారా సులువుగా కరెంట్ బిల్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా కరెంట్ బిల్లు డౌన్ లోడ్ చేసుకోవడమెలా..?

ముందుగా మీకు విద్యుత్ సరఫరా చేసే పంపిణీ సంస్థ వెబ్ సైట్లోకి వెళ్లాలి. APCPDCL, TGSPDCL, TGNPDCL లాంటి అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలి. ఉదాహరణకు APCPDCL వినియోగదారులు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.

కరెంట్ బిల్లు డౌన్‌లోడ్ ఎలా..?

-ముందుగా ఏపీసీపీడీసీఎల్(APCPDCL) వెబ్ సైట్‌ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో నో అండ్ పే యువర్ బిల్ ఆప్షన్ ఎంచుకోండి

-అనంతరం మీ సర్వీస్ నెంబర్, క్యాప్చా నమోదు చేయండి

-అనంతరం సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత బిల్ అండ్ పేమెంట్ హిస్టరీ ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత బిల్ హిస్టరీలో కేటగిరీలో నెల, బిల్ డేట్, బిమ అమౌంట్‌తో పాటు డౌన్లోడ్ బిల్ ఆప్షన్ కనిపిస్తుంది

-డౌన్ లోడ్ బిల్ కేటగిరీలో కరెంట్ బిల్లు ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

టీజీఎన్‌పీడీసీఎల్ వినియోగదారులు ఇలా చేయండి..

-టీజీఎన్‌పీడీసీఎల్ https://tgnpdcl.com/ పోర్టల్‌లోకి వెళ్లాలి

-హోమ్ పేజీలో నో యువర్ బిల్ ఆప్షన్ ఎంచుకోవాలి

-మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి

-అనంతరం గెట్ బిల్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది

ఇతరులు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి..?

మీకు విద్యుత్ సరఫరా చేసే సంస్థ వెబ్ సైట్లోకి వెళ్లండి. మీకు అందులో నో యువర్ బిల్, బిల్ ఎంక్వైరీ లాంటి ఆప్షన్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే కరెంట్ బిల్లు వివరాలు తెలుసుకోవడంతో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కరెంట్ బిల్లు కనిపించకపోతే ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు.

Follow Us