Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ ఎంతుందంటే..

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం వినియోగదారులకు కాస్త ఊరట కల్పించే అంశంగా చెప్పొచ్చు. గత రెండు రోజులుగా ప్రతీ రోజు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. ఈరోజు తులం బంగారంపై...

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ ఎంతుందంటే..
Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 16, 2024 | 6:29 AM

బంగారం ధరలో ప్రతీ రోజూ తగ్గుదల కనిపిస్తోంది. అయితే గతంలో పెరిగిన దానితో పోల్చితే ఇది తక్కువేనని చెప్పాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం వినియోగదారులకు కాస్త ఊరట కల్పించే అంశంగా చెప్పొచ్చు. గత రెండు రోజులుగా ప్రతీ రోజు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. ఈరోజు తులం బంగారంపై రూ. 10 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,060 వద్ద కొనసాగుతోంది. మరి శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,210 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,060 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,390కాగా, 24 క్యారెట్ల ధర రూ. 62,610గా ఉంది. బెంగళూరులో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,060కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,060 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,060కి చేరింది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా శుక్రవారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 74,600కి చేరింది. ఇక ఢిల్లీలో పాటు ముంబయి, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 76,100కి చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే