Gold Rate Today: మళ్లీ పుంజుకుంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: దివాళి తర్వాత భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి.. గత రెండు మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం బంగారం ధర స్పల్పంగా పెరిగాయి. కాబట్టి దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

గత రెండు వారాలుగా బంగారం ధరలు భారీగా పడిపోతూ వచ్చాయి. కానీ గత రెండ్రోజులుగా పసిడి మళ్లీ పరుగులు ప్రారంభించింది. దీంతో గత రెండ్రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆదివారం బంగారం ధరలు కాస్తా నికడగానే ఉన్నా.. సోమవారం మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,23,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతుంది. సోమవారం ఉదయం 10 గంటలకు దేశీయ మార్కెట్‌లో కేజీ బంగారం ధర రూ. 1,54,000గా కొనసాగుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,030 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,500 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు
ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.1,54,000 వద్ద కొనసాగుతోంది.
మీరు బంగారం కొనాలనుకుంటే ఇది మంచి సమయే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే మీరు బంగారం కొనే ముందు దాని స్వచ్ఛతను చెక్ చేయడం చాలా ముఖ్యం. మీరు బంగారం స్వచ్చమైనదా కాదా అనేది దాని హాల్‌మార్క్ నెంబర్‌పై ఆధారపడి ఉంటుంది. 24 క్యారెట్ బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి మీరు బంగారు స్వచ్చతను అంచనా వేయచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




