AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణీకులకు ఇది కదా కావాల్సింది.. ఇకపై రైళ్లలో..

భారతీయ రైల్వే మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం రైళ్లలో తక్కువ చక్కెర, షుగర్ ఫ్రీ ఆహారాన్ని ప్రవేశపెట్టింది. రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఆ వివరాలు ఇలా..

Indian Railways: ప్రయాణీకులకు ఇది కదా కావాల్సింది.. ఇకపై రైళ్లలో..
గమనికి: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివారగా ఆధారంగా అందించబడినవి వీటిపై మీకు సందేహాలు ఉంటే.. రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌, లేక రైల్వే అధికారులను సంప్రదించవచ్చు.
Ravi Kiran
|

Updated on: Nov 03, 2025 | 11:36 AM

Share

భారతీయ రైల్వేశాఖ దేశవ్యాప్తంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు శుభవార్తను అందించింది. రైళ్లలో ప్రయాణించే డయాబెటిక్ రోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇకపై ప్రత్యేకంగా తయారు చేసిన షుగర్ ఫ్రీ ఆహారాన్ని అందించాలని రైల్వే బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక నిర్ణయం ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే డయాబెటిక్ ప్రయాణికులకు గొప్ప ఉపశమనాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిస్ రాజధానిగా భారత్ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, వారి ఆరోగ్య అవసరాలను తీర్చడానికి రైల్వే ఈ చర్య చేపట్టింది.

ప్రీమియం రైళ్లుగా పేరొందిన రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ఈ ప్రత్యేక ఆహార సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు తమ రిజర్వేషన్ ఫారంలో డయాబెటిక్ ఫుడ్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. దీనివల్ల క్యాటరింగ్ సిబ్బంది ముందుగానే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు వీలు ఉంటుంది.

అన్ని ప్రీమియం రైళ్లు ఇకపై ఐదు రకాల ఆహార ఎంపికలను అందిస్తాయి. వీటిలో వెజ్, నాన్-వెజ్, జైన్ భోజనంతో పాటుగా, డయాబెటిక్ వెజ్, డయాబెటిక్ నాన్-వెజ్ కూడా ఉంటాయి. డయాబెటిక్ ఆహార మెనూలో తక్కువ పిండి పదార్థాలు, తక్కువ కొవ్వు ఉండే వంటకాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఈ మెనూలో బ్రౌన్ బ్రెడ్, వైట్ ఎగ్ ఆమ్లెట్, ఉడకబెట్టిన కూరగాయలు, దాలియా, ఓట్స్, అంకురిత చాట్, గ్రిల్డ్ శాండ్‌విచ్‌లు వంటివి ఉంటాయి. స్వీట్లకు బదులుగా షుగర్ ఫ్రీ స్వీట్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా, ఈ మెనూలో పప్పులు, కూరగాయలు, సూపులు, కొన్ని రకాల బ్రెడ్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం చక్కెర లేని టీ, కాఫీ ప్యాకెట్లు కూడా అందిస్తారు.

రైల్వే బోర్డు ఈ ప్రత్యేక ఆహార సదుపాయాన్ని విధిగా అమలు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు, క్యాటరింగ్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్యాటరింగ్ సిబ్బంది ఈ కొత్త నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఏ కారణం చేతనైనా డయాబెటిక్ ఆహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భారతీయ రైల్వే ప్రయాణికుల సంక్షేమానికి, సౌకర్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టంగా నిరూపించింది.

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు