Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు
శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనేస్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బంగారం తులం ధర..
శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనేస్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బంగారం తులం ధర బుధవారం రూ.1000 పెరిగితే.. నిన్న గురువారం రూ.500 పెరిగింది. ఇక ఈరోజు విషయానికొస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.72,870 ఉండగా.. శుక్రవారం రూ.72,860గా ఉంది. విజయవాడలో నిన్న తులం రూ.72,870 ఉండగా.. ఈ రోజు రూ.72,860గా ఉంది. ఇతర నగరాల విషయానికొస్తే ఈ రోజు 24 క్యారెట్ల పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో రూ. 73,360, ముంబైలో రూ. 72,860, కోల్‌కతాలో రూ. 72,860, బెంగళూరులో రూ. 72,860, కేరళలో రూ. 72,860, చెన్నైలో రూ. 72,860గా ధరలు ఉన్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ. 66,790, విజయవాడలో రూ.రూ. 66,790, ఢిల్లీలో రూ. 66,940, ముంబైలో రూ. 66,790, కోల్‌కతాలో రూ. 66,790, బెంగళూరులో రూ. 66,790, కేరళలో రూ. 66,790, చెన్నైలో రూ. 66,790గా ధరలు ఉన్నాయి.
వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం, శుక్రవారం ధరల్లో ఏ మాత్రం తగ్గుదల లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.92,080 ఉండగా.. విజయవాడలో రూ.90,080గా ఉంది. ఢిల్లీలో రూ. 85,080, కోల్‌కతాలో రూ. 85,080, ముంబైలో రూ. 85,080, బెంగళూరులో రూ. 83,930, కేరళలో రూ. 84,130, చెన్నైలో రూ. 84,120 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి.
నోట్: పైన తెలిపిన బంగారం, వెండి ధరలను ఎలాంటి పన్ను లేకుండా వెల్లడించాం. జీఎస్టీ, మేకింగ్ చార్జీలు కలిపితే వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.