AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: కొత్త మైలురాయిని తాకుతున్న బంగారం.. రూ.65 వేలకు చేరువలో.. మరి గోల్డ్‌ ధర ఇక్కడితో ఆగుతుందా?

బంగారం ధరలు ట్రెక్కింగ్‌ చేస్తూనే ఉన్నాయి. రోజురోజుకు పైకి వెళ్తున్నాయేగాని.. దిగి రావడం లేదు. ఇప్పుడు గోల్డు కొత్త మైల్‌స్టోన్‌ని చేరుకుంది. గతేడాది 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేలకు చేరుకుంది 24క్యారెట్‌ గోల్డ్‌. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు మేలిమి స్పాట్‌ గోల్డ్‌ ధర మంగళవారం ఒక్కరోజే రూ.800 మేర పెరిగి రూ.65 వేలకు చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.64,200 వద్ద ముగిసింది..

Gold Price: కొత్త మైలురాయిని తాకుతున్న బంగారం.. రూ.65 వేలకు చేరువలో.. మరి గోల్డ్‌ ధర ఇక్కడితో ఆగుతుందా?
Gold Price
Subhash Goud
|

Updated on: Mar 06, 2024 | 6:22 AM

Share

బంగారం ధరలు ట్రెక్కింగ్‌ చేస్తూనే ఉన్నాయి. రోజురోజుకు పైకి వెళ్తున్నాయేగాని.. దిగి రావడం లేదు. ఇప్పుడు గోల్డు కొత్త మైల్‌స్టోన్‌ని చేరుకుంది. గతేడాది 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేలకు చేరుకుంది 24క్యారెట్‌ గోల్డ్‌. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు మేలిమి స్పాట్‌ గోల్డ్‌ ధర మంగళవారం ఒక్కరోజే రూ.800 మేర పెరిగి రూ.65 వేలకు చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.64,200 వద్ద ముగిసింది. అటు వెండి సైతం కేజీ 900 రూపాయల మేర పెరిగి 74,900కు చేరింది. అలాగే బుధవారం అంటే మార్చి 6వ తేదీన కూడా  బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రభావంతోనే దేశీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2100 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. ఔన్సు వెండి 23.88 డాలర్లుగా కొనసాగుతోంది.

అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి.. జూన్‌ నుంచి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. బంగారం ఇలానే పరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. ఆరేళ్లలో బంగారం రేటు రెట్టింపు అయింది. 2018లో 30వేలలో ఉంటే.. ఇప్పుడు 65 వేలకు చేరింది. ఇది ఇంతటితో ఆగదని.. బంగారం వచ్చే సంవత్సరం కాలంలోనే 80వేలకు చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనుకునే వారు… ఎక్స్‌పర్ట్‌ సలహాలు తీసుకోవాలని అనలిస్టులు చెబుతున్నారు.

తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,160 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,630

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,610 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,010

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

కేరళ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బుధవారం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.74,800

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి