Gold Price Today: హుర్రే.! బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. గడిచిన మూడు రోజుల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య ధరల వత్యాసాన్ని పోలిస్తే బంగారం దాదాపుగా రూ. 2 వేలు తగ్గింది. దీంతో తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర..

Gold Price Today: హుర్రే.! బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
Gold Price Today
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2024 | 8:15 AM

గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. గడిచిన మూడు రోజుల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య ధరల వత్యాసాన్ని పోలిస్తే బంగారం దాదాపుగా రూ. 2 వేలు తగ్గింది. దీంతో తాజాగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,840 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 65,690 కాగా, 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 71,660గా ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660గా ఉంది.

చెన్నై విషయానికొస్తే గురువారం ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,490 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,540గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాదర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 65,690కాగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 65,690కాగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660గా ఉంది.

ఇది చదవండి: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. 91,400కి చేరుకోగా ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో ఇదే ధర కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటు, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా రూ. 95,900కి చేరింది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ ధరల వివరాలను తెలుసుకోవడానికి మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను కూడా తనిఖీ చేయవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..