Viral: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..

ఇండోనేషియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన వివాహిత చివరకు కొండచిలువకు ఆహారంగా మారిన ఘటన తాజాగా వెలుగు చూసింది. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..
Representative Image
Follow us

|

Updated on: Jun 09, 2024 | 1:30 PM

ఇండోనేషియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన వివాహిత చివరకు కొండచిలువకు ఆహారంగా మారిన ఘటన తాజాగా వెలుగు చూసింది. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఫరీదా అనే 45 ఏళ్ల వివాహితకు నలుగురు పిల్లలు ఉన్నారు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ ఉబ్బెత్తుగా మారిన ఉదర భాగంతో కదలలేకుండా కనిపించింది. దీంతో, దాని పొట్ట చీల్చి చూడగానే వివాహిత తలభాగం బయటపడింది. మహిళ ఒంటిపై దుస్తులు కూడా యథాతథంగా ఉన్నాయి. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి భర్త కన్నీరుమున్నీరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?

కొండచిలువలు మనుషులను టార్గెట్ చేయడం అరుదే అయినా ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో పలు ఘటనలు వెలుగు చూశాయని స్థానికులు చెబుతున్నారు. గతేడాది, ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి చంపేశారు. 2018లో వెలుగు చూసిన మరో ఘటనలో ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. కొన్ని రోజుల తరువాత ఆమె మృతదేహాన్ని కొండచిలువ కడుపులో గుర్తించారు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!