Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేస్తుండగా ఒకేసారి వచ్చిన దగ్గు, తుమ్ములు.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

భోజనం చేస్తుండగా ఒకేసారి వచ్చిన దగ్గు, తుమ్ములు.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది..
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 08, 2024 | 10:06 PM

Share

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధుడు అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకేసారి తుమ్మూ, దగ్గూ రావడంతో ఆయన పొట్ట చిట్లి పేగులు బయటకు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదర భాగంలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఉదరంపై కోతపెట్టి ఆపరేషన్ చేశారు. అనంతరం గాయానికి కుట్లు వేశారు. ఆపరేషన్ తాలుకు గాయం నుంచి వృద్ధుడు పూర్తిగా కోలుకోలేదు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

ఇటీవల ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తుండగా ఉదరభాగంపై తడిగా ఉన్నట్టు అనిపించింది. ఈలోపు తుమ్మూ, దగ్గు రావడంతో ఆపరేషన్ గాయం ఉన్న చోట కడుపు చిట్లి పేగులు బయటకు వచ్చాయి. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

ఉదరం, పొత్తికడుపు భాగంలో ఆపరేషన్లు అయిన వారికి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ తాలూకు గాయాలు మానకపోతే తుమ్మూ, దగ్గుతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. శస్త్రచికిత్సల తరువాత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాయాలు మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి