- Telugu News Photo Gallery Cricket photos Abhishek Sharma Sets Club Cricket Tournament On Fire With Blistering Century
కేవలం 25 బంతుల్లోనే.. 14 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ఈ SRH బ్యాటర్ ఎవరో తెలుసా.?
ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పేలుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. గుర్గావ్‌లోని క్లబ్ క్రికెట్ టోర్నీలో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ కేవలం 26 బంతుల్లోనే అదిరిపోయే సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Updated on: Jun 08, 2024 | 8:25 PM

ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పేలుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. గుర్గావ్‌లోని క్లబ్ క్రికెట్ టోర్నీలో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ కేవలం 26 బంతుల్లోనే అదిరిపోయే సెంచరీ చేశాడు.

ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మారియో క్రికెట్ క్లబ్, పంటర్స్ ఎలెవన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన మారియో క్రికెట్ క్లబ్ ఓపెనర్ కృనాల్ సింగ్ 21 బంతుల్లో 60 పరుగులు చేయగా, నదీమ్ ఖాన్ 32 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేశాడు. దీంతో మారియో క్లబ్ నిర్ణీత 20 ఓవర్లకు 249 పరుగులు చేసింది.

ఇక 250 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పంటర్స్ ఎలెవన్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి ఓవర్ నుంచే మైదానం నలువైపులకు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మారియో క్లబ్ బౌలర్లను ఊచకోత కోశాడు.

ఫలితంగా కేవలం 25 బంతుల్లోనే అభిషేక్ తన బ్యాట్‌తో భారీ సెంచరీ బాదేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో అతడు ఏకంగా 14 సిక్సర్లు కొట్టాడు. అలాగే అందులో 4 ఫోర్లు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా అభిషేక్ శర్మ బౌండరీల రూపంలోనే 100 పరుగులు సాధించాడు.

కేవలం 26 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. తన పేలుడు బ్యాటింగ్‌తో పంటర్స్ ఎలెవన్ జట్టును 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 250 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో సహాయపడ్డాడు. దీంతో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో 484 పరుగులు చేశాడు. అలాగే ఈసారి సీడీసీ 42 సిక్సర్లు కొట్టాడు. అయితేనేం అతడికి మాత్రం టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో ప్రస్తుతం క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు అభిషేక్ శర్మ.




