Cibil score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే వడ్డీ ఎక్కువ చెల్లించాలా.?

సాధారణంగా 750 కంటే ఎక్కువగా ఉంటే అది మంచి స్కోర్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ స్కోర్‌ ఉన్న వాళ్లకు వెంటనే రుణాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రీ అప్రువుడ్ లోన్స్‌ను సైతం ఇస్తాయి. అయితే 600 లేదా అంతకంటే తక్కు స్కోర్‌ ఉన్నా, క్రెడిట్ హిస్టరీ బాగా లేకపోయినా బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు...

Cibil score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే వడ్డీ ఎక్కువ చెల్లించాలా.?
Cibil Score
Follow us

|

Updated on: Jun 10, 2024 | 8:17 AM

లోన్‌ కోసం ప్రయత్నించగానే మొదటగా వచ్చే ప్రశ్న సిబిల్‌ స్కోర్‌ ఎంత ఉంది.? ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా లేదా.? అని బ్యాంకులు నిర్ణయానికి వస్తాయి. అందుకే సిబిల్ స్కోర్‌ను పదిలంగా కాపాడుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. మనకు తెలిసో, తెలియకో ఏదో చిన్న రుణాన్ని నిర్లక్ష్యం చేసినా అది సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.

సాధారణంగా 750 కంటే ఎక్కువగా ఉంటే అది మంచి స్కోర్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ స్కోర్‌ ఉన్న వాళ్లకు వెంటనే రుణాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రీ అప్రువుడ్ లోన్స్‌ను సైతం ఇస్తాయి. అయితే 600 లేదా అంతకంటే తక్కు స్కోర్‌ ఉన్నా, క్రెడిట్ హిస్టరీ బాగా లేకపోయినా బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు. ఒకవేళ ఇచ్చినా అత్యధికంగా వడ్డీని వసూలు చేస్తాయి.

సిబిల్‌ స్కోర్‌కు వడ్డీ రేటుకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా.? అవును తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్న వారి నుంచి బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. ఉదాహరణకు మీ సిబిల్‌ స్కోర్‌ 820గా ఉందనుకుంటే మీకు హౌజింగ్ లోన్‌ 8.35 శాతానికి లభిస్తుంది. అదే మీ స్కోర్‌ 580 అయితే మీ నుంచి 10.75 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఒకవేళ మీరు రూ. 50 లక్షల రుణం తీసుకుంటే మీరు వడ్డీ రూపంలో రూ. 53 లక్షలు చెల్లిస్తారు. అదే మీ స్కోర్‌ 850 అయితే మీరు వడ్డీ రూపంలో ఏకంగా రూ. 71.82 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సిబిల్‌ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా మీరు ఏకంగా రూ. 18.82 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

సిబిల్ స్కోర్‌ ఎలా పెంచుకోవాలి..

* సిబిల్ స్కోర్ హెల్తీగా ఉండాలంటే ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలి. ఆలస్యంగా చెల్లించినా, కొన్ని నెలలు కట్టకుండా ఉన్నా క్రెడిట్ స్కోర్‌ ఒక్కసారిగా పడిపోతుంది.

* ఇక క్రెడిట్‌ కార్డుల్‌ లిమిట్‌ను ప్రతీసారి పూర్తిగా కాకుండా క్రెడిట్ లిమిట్‌ 30 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు.

* కేవలం రుణం తీసుకున్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు సిబిల్ స్కోర్‌ను చెక్‌ చేసకుంటూ ఉండాలి. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు.

* కొన్ని సందర్భాల్లో మీరు గతంలో ఎప్పుడో తీసుకున్న చిన్న రుణం కూడా చెల్లించకుండా డీఫాల్ట్‌గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఉన్న అన్ని బ్యాంక్‌ అకౌంట్స్‌లో ఏవైనా లోన్స్‌ ఉన్నాయేమో చూసుకోవాలి, ఉంటే వాటిని క్లియర్‌ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!