AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మీకు తిరుగే ఉండదు.

అయితే కాలానికి అనుగుణంగా, మంచి ఆలోచనతో వ్యాపారం చేస్తే లాభాలు కచ్చితంగా ఆర్జించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అంతా కల్తీగా మారుతోన్న రోజుల్లో స్వచ్ఛమైన ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ విక్రయిస్తే కచ్చితంగా ఊహకందని లాభాలు పొందొచ్చు. ఇలాంటి మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

Business Idea: ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మీకు తిరుగే ఉండదు.
Business Idea
Narender Vaitla
|

Updated on: Jun 10, 2024 | 11:16 AM

Share

వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఉద్యోగం చేసే వారు కూడా ఏదో ఒక రోజు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనే నిశ్చయంతో ఉంటారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. అయితే మనలో చాలా మందికి వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్నా. పెట్టుబడికి భయపడి, లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో ఆ దిశగా అడుగులు వేయడానికి ఆసక్తి చూపరు.

అయితే కాలానికి అనుగుణంగా, మంచి ఆలోచనతో వ్యాపారం చేస్తే లాభాలు కచ్చితంగా ఆర్జించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అంతా కల్తీగా మారుతోన్న రోజుల్లో స్వచ్ఛమైన ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ విక్రయిస్తే కచ్చితంగా ఊహకందని లాభాలు పొందొచ్చు. ఇలాంటి మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

వంటింట్లో కచ్చితంగా ఉండాల్సిన వాటిలో నెయ్యి ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొంత మంది నెయ్యిని సైతం కల్తీ చేస్తూ మోసం చేస్తున్నారు. దీంతో జేబుకు చిల్లు పడడమే కాకుండా, ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి స్వచ్ఛమైన నెయ్యిని మీరే తయారు చేసి మీ ఇంటికి సమీపంలో ఉన్న వారికో, మీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న వారికో విక్రయిస్తూ లాభాలు పొందొచ్చు. ఇంతకీ నెయ్యి తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? దీనికి ఎంత ఖర్చవుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం క్రీమ్‌ సెపరేట్ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషిన్స్‌ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మిషిన్స్‌లో హ్యాండ్ ఆపరేటింగ్‌ లేదా మోటర్‌తో కూడిన మిషిన్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. మీ పెట్టుబడికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇక నెయ్యి తయారీకి కావాల్సింది నెయ్యి ఒకటి. ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండేలా పాల కేంద్రం నుంచి లేదా రైతుల నుంచి నేరుగా పాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

తయారీ విధానం..

ముందుగా పాలను తీసుకొని క్రీమ్‌ సెపరేట్‌ మిషిన్‌లో వపోయాల్సి ఉంటుంది. దీంతో క్రీమ్‌ ఒకవైపు నుంచి పాలు మరో వైపు నుంచి వస్తాయి. క్రీమ్‌లేని మిల్క్‌ను మళ్లీ టీ షాప్స్‌కు అమ్ముకోవచ్చు. ఇక క్రీమ్ను తీసుకొని వేడి చేస్తే సరిపోతుంది నెయ్యి రడీ అయినట్లే. దీనిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్ముకోవచ్చు. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే సుమారు 20 లీటర్ల పాలు అవసరమవుతాయి. ఇక లాభాల విషయానికొస్తే ఉదాహరణకు మీరు 100 లీటర్ల పాలు తీసుకుంటే.. 5 కిలోల నెయ్యితో పాటు 80 లీటర్ల పాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర రూ. 700 వరకు ఉంటుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో సుమారు రూ. 3500 లాభం వస్తుంది. అలాగే మిగిలిన పాలను కనీసం లీటర్‌కు రూ. 40 చొప్పున అమ్ముకున్నా రూ. 3200 లాభం వస్తుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో రూ. 6700 సంపాదించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా