AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: ఇలా చేస్తే రూ. లక్షలో లాభపడొచ్చు.. హోమ్ లోన్ వినియోగదారులూ మిస్ కాకండి..

ఉదాహరణకు రూ. 50లక్షలు రుణం తీసుకోవాలనుకున్నారనుకోండి.. బ్యాంకులో దరఖాస్తు చేస్తే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని వడ్డీ రేటు 10.75శాతం విధించారనుకోండి.. అదే సమయంలో సిబిల్ స్కోర్ బాగుంటే కేవలం 8.35శాతానికి వచ్చేది అని బ్యాంకు వారు మీకు చెబితే చాలా బాధపడతారు. ఆ చిన్న విషయమే మీరు కొన్ని లక్షలు బ్యాంకుకు అదనంగా చెల్లించేలా చేసింది.

Credit Score: ఇలా చేస్తే రూ. లక్షలో లాభపడొచ్చు.. హోమ్ లోన్ వినియోగదారులూ మిస్ కాకండి..
Loan Emi
Madhu
|

Updated on: Jun 10, 2024 | 4:06 PM

Share

చాలా మందికి జీవితంలో సొంత ఇల్లు అనేది అతి పెద్ద కలగా ఉంటుంది. దాని కోసం జీవితాంతం శ్రమిస్తారు. అంతేకాక కొంత డబ్బును పొదుపు చేసి.. మిగిలిన మొత్తాన్ని హోమ్ లోన్ రూపంలో తీసుకొని ఇల్లు కట్టుకోనే వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. సాధారణంగా ఒక బ్యాంకులో హోమ్ లోన్ కోసం వెళ్లినప్పుడు వారు చెప్పే వడ్డీ రేటు మొదట ఒకలా ఉంటుంది. తీరా అప్లికేషన్ ప్రాసెస్ చేసే సమయంలో వడ్డీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిపై మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు రూ. 50లక్షలు రుణం తీసుకోవాలనుకున్నారనుకోండి.. బ్యాంకులో దరఖాస్తు చేస్తే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని వడ్డీ రేటు 10.75శాతం విధించారనుకోండి.. అదే సమయంలో సిబిల్ స్కోర్ బాగుంటే కేవలం 8.35శాతానికి వచ్చేది అని బ్యాంకు వారు మీకు చెబితే చాలా బాధపడతారు. ఆ చిన్న విషయమే మీరు కొన్ని లక్షలు బ్యాంకుకు అదనంగా చెల్లించేలా చేసింది. అప్పుడు ఆలోచన చేస్తే.. సిబిల్ స్కోర్ ఎందుకు తగ్గిందో మీకు అర్థం కాదు. సడన్ గా సిబిల్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకు కారణాలు ఏంటి? దాని నుంచి బయట పడేందుకు ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

అకస్మాత్తుగా సిబిల్ ఎందుకు పడిపోతుంది?

ఇటీవల కాలంలో చాలా మంది తమ సిబిల్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. వందలాది మంది సోషల్ మీడియాలో తమ సిబిల్ స్కోర్ అకస్మాత్తుగా క్రాష్ అయ్యిందని చెబుతున్నారు. సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోడానికి కారణాలు ఇవి అయ్యే అవకాశం ఉంది.. అవేంటేంటే ఏదైనా తప్పు లావాదేవీ కారణంగా క్రెడిట్ స్కోర్‌లు తగ్గవచ్చు; రుణదాతలు తప్పుగా నివేదించడం; క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేయడం. బై నౌ పే లేటర్ ఆప్షన్ల వివరాలు క్రమంగా నమోదు కాకపోవడం, ఒకేసారి ఎక్కువ లోన్లు కోసం దరఖాస్తు చేయడం, మీ క్రెడిట్ కార్డులో అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి ఉండటం, తీసుకున్న రుణాలను తిరిగి కట్టలేక సెటిల్ మెంట్ కోసం ప్రయత్నించడం వంటి వాటి వల్ల సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. అందుకే మీ క్రెడిట్ స్కోర్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి. స్టేట్‌మెంట్‌లో ఏదైనా తప్పు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

మంచి సిబిల్ స్కోర్ కోసం ఇలా చేయండి..

  • సకాలంలో చెల్లింపులు చేయండి.. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించారని నిర్ధారించుకోండి. ఆలస్య చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
  • క్రెడిట్ వినియోగ నిష్పత్తి.. మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ పరిమితి శాతం) 30% కంటే తక్కువగా ఉంచండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్‌ను సూచిస్తుంది. ఇది మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • మీ క్రెడిట్ నివేదికను పర్యవేక్షించండి.. మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు, లోపాలను వెంటనే సరిదిద్దాలి. దీని ద్వారా మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.
  • ఒకే సమయంలో ఎక్కువ రుణాలొద్దు.. రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా చేసే దరఖాస్తులు మీ నివేదికపై అనేక హార్డ్ ఎంక్వైరీలకు దారి తీయవచ్చు. ఇది మీ స్కోర్‌ను తగ్గిస్తుంది. కొత్త క్రెడిట్ కోసం పొదుపుగా, అవసరమైనప్పుడు మాత్రమే దరఖాస్తు చేసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..