Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో నిలకడగా ధరలు.. వివిధ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తులం ధర ఎంతంటే..
Gold Price Today: బంగారం కోనాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం
Gold Price Today: బంగారం కోనాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం ఉదయం దేశీయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కోనుగోలు చేయాలనికునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.43,260 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్స్లో మార్పులు జరగలేదు.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.43,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,190గా ఉంది. ఇక అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్ 43,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,190 కొనసాగుతుంది. ఇక దేశ రాజధానీ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.45,410 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,530గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇందులో రూ.90 పెరిగింది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,460 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,460 ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.330 పెరిగింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,780 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,760గా కొనసాగుతుంది. నిన్నిటితో పోల్చుకుంటే రూ.10 పెరిగింది. కాగా పసిడి ధర పై అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల్లోని బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెల్లరీ మార్కెట్ ఇలాంటివి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయని చెప్పుకోవచ్చు.
బంగారం ధరలు మరింత దిగువకు.. ఆరు నెలల్లో రూ. 10,000 తగ్గుదల.. కొనడానికి ఇది సరైన సమయమేనా.!