AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పటడుగు వేసి పార్టీ మారా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశాః గూడెం మహిపాల్ రెడ్డి

ఆ ఎమ్మెల్యే ఎటు వైపు ఉన్నారన్నది కొద్దిరోజుల క్రితం వరకు జరిగిన చర్చ. ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ మారినా ఆయన చూపంతా పాత గూటిపైనే ఉందన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

తప్పటడుగు వేసి పార్టీ మారా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశాః గూడెం మహిపాల్ రెడ్డి
Gudem Mahipal Reddy
Balaraju Goud
|

Updated on: Jan 18, 2026 | 9:28 PM

Share

ఆ ఎమ్మెల్యే ఎటు వైపు ఉన్నారన్నది కొద్దిరోజుల క్రితం వరకు జరిగిన చర్చ. ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ మారినా ఆయన చూపంతా పాత గూటిపైనే ఉందన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. BRS పార్టీని వీడి తప్పు చేశానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితిలో తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని.. అయితే కాంగ్రెస్‌లో తనకు, నియోజకవర్గానికి వెంట్రుక వంతు లాభం కూడా జరగలేదని కామెంట్ చేశారు. మూడుసార్లు BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. టెక్నికల్‌గా వాళ్లు కారు పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ తీర్పు ఇచ్చినా.. వారిలో చాలామంది హస్తం పార్టీతోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల జాబితాలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ఎస్‌ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. కొన్ని నెలల క్రితమే మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే పార్టీ మారారు. అయితే కాంగ్రెస్‌ నేతలతో సఖ్యత కుదరలేదు. గతంలో ఓసారి గూడెం వర్గీయులకు పటాన్‌చెరు కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. దీనిపై టీపీసీసీలో ఒకరికొకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటున్నా.. అధికార పార్టీతో మహిపాల్ రెడ్డి అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు.

ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ కోసం కాకుండా బీఆర్ఎస్ కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారా ? అనే చర్చ జరుగుతోంది. దీంతో మళ్లీ ఆయన సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
మీ బొటనవేలు ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ బొటనవేలు ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..?
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..?
వినియోగదారులకు అలర్ట్‌.. వచ్చే వారంలో బ్యాంకులు భారీగా సెలవులు..!
వినియోగదారులకు అలర్ట్‌.. వచ్చే వారంలో బ్యాంకులు భారీగా సెలవులు..!