AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

చైనా మాంజాను వాడొద్దని పోలీసులు పదేపదే చెబుతున్న.. ఎవరు లెక్క చేయడం లేదు. వీటిని నివారించాలని వివిధ షాపులపై పోలీసులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా.. వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు.. యదేచ్చగా దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వాటి వల్ల ఎందరో గాయపడడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
Chinese Manja
P Shivteja
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 9:56 PM

Share

సంక్రాంతి పండుగ వేళ సరదాకోసం కొందరు వాడే మాంజా దారం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి (మం) ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఇద్దరు యువకుల మెడకు మంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలం సైదాపూర్‌లో చైనా మాంజాతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సాయికుమార్ (18) అనే యువకుడు బైక్ పై పొలానికి వెళ్తుండగా మాంజా దారం మెడకు చుట్టుకుంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతని చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటన జరిగిన కాసేపటికే రాయికోడ్ (మం) ధర్మాపూర్ గ్రామంలో మరో సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న సాయి కుమార్ అనే యువకునికి బైక్‌పై వెళ్తుండగా మాంజా దారం మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు.

ఇలా కేవలం రెండు మూడు రోజలు వ్యవధిలోనే మాంజ దారం వల్ల అనేక మంది గాయపడగా మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా సరదాకోసం వాడే ఈ కనిపించిన మృత్యువులు ప్రజల పాలిక యమపాశాలుగా మారుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఇలాంటి చైనా మాంజాను వినియోగించవద్దని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?