Liquor Price: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ బ్రాండ్లపై ఉన్న ధరలు తగ్గబోతున్నాయ్‌..!

Liquor Price: మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త వినబోతున్నారు. కేంద్ర సర్కార్‌ త్వరలో పలు బ్రాండ్లపై ధరలు తగ్గించే యోచన చేస్తోంది. యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న ...

Liquor Price: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ బ్రాండ్లపై ఉన్న ధరలు తగ్గబోతున్నాయ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 22, 2021 | 9:58 PM

Liquor Price: మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త వినబోతున్నారు. కేంద్ర సర్కార్‌ త్వరలో పలు బ్రాండ్లపై ధరలు తగ్గించే యోచన చేస్తోంది. యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న వైన్స్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఈ కారణంగా విదేశీ వైన్స్‌లో చాలా బ్రాండ్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే లభించే అవకాశాలున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, కేంద్ర ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ మ్యాన్యూఫాక్చర్స్‌ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా యూరోపియన్‌ యూనియన్‌తో యూరప్‌-ఇండియా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్నయం తీసుకుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా యూరప్‌ ఆల్కహాల్‌ బ్రాండ్లపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది.

నిర్ణయం అమలైతే తక్కువ ధరలలో..

కాగా, ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 150 శాతం కస్టమ్స్‌ డ్యూటీని విధిస్తోంది. ఈయూ-ఇండో వాణిజ్య ఒప్పందంలో భాగంగా కస్టమ్స్‌ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధరకంటే తక్కువగా దొరికే అవకాశం ఉంది.

ధరలు తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్‌ సంస్థలకు ఇబ్బందులు:

అయితే విదేశీ ఆల్కహాల్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడంవల్ల దేశీయ ఆల్కహాల్‌ ఉత్పత్తి కంపెనీల బిజినెస్‌ విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ సందర్భంగా కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీస్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరీ మాట్లాడుతూ.. భారత్‌తో పోల్చుకుంటే యూరప్‌లో ఆల్కహాల్‌ ఉత్పత్తుల తయారీకి అయ్యే ఖర్చు 50 శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కస్టమ్స్‌ సుంకం పరిమితి మించి తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్‌ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆయన అన్నారు.

కాగా, సీఐఏబీసీ గణాంకాల ప్రకారం.. యూరప్‌ నుంచి భారత్‌ ఏడాదికి రూ.1,850 కోట్ల వైన్‌ను దిగుమతి చేసుకుంటోంది. కేవలం రూ.160 కోట్ల వైన్‌ను మాత్రమే యూరప్‌కు ఇండియా ఎగుమతి చేస్తోంది. దేశీయ ఆల్కహాల్‌ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ భారత్‌లో రూ.4.5 లక్షల కోట్లు ఉంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే