Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే..
అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు. శ్రీమహాలక్ష్మీ
అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.
అయితే గత వారం రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అక్షయ తృతీయ రోజున అంటే మే 10వ తేదీన బంగారం ధర భారీగానే పెరిగింది. అయితే ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరల్లో తగ్గుముఖం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. భారీగా ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.850 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.930 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,000 ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.73,090 వద్ద ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.1300 వరకు ఎకబాకి మధ్యాహ్నం సమయానికి రూ.86,500 వద్ద కొనసాగింది.
అధిక ధరలు ఉన్నప్పటికీ, ఈ అక్షయ తృతీయ దేశంలో బంగారు ఆభరణాలు, నాణేలకు డిమాండ్ బాగానే ఉండవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బంగారంపై విపరీతమైన రాబడి మధ్య బలమైన డిమాండ్ కారణంగా అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు 14% పెరుగుతాయని అంచనా. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రకారం, అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా 25 టన్నుల వరకు బంగారం అమ్ముడవుతుందని అంచనా వేయగా, గత అక్షయ తృతీయ నాడు 22 టన్నుల బంగారం విక్రయాలు కొనసాగాయి. ఈసారి అక్షయ తృతీయతో పెళ్లిళ్ల సీజన్ లేదు. దీంతో వధువు కోసం భారీ నగలకు గిరాకీ లేదు. ఈసారి ధరల పెరుగుదల కారణంగా తేలికపాటి ఆభరణాలకు ప్రజలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, వెండిపై పెట్టుబడి రాబోయే రోజుల్లో బంగారం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలదు. వెండి బంగారం కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో ఇప్పటివరకు, బంగారం ధరలు 13% పెరిగాయి. వెండి ధరలు 11% పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..