Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతుంది. బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. చాలా మంది తక్కువో, ఎక్కువో బంగారం కొంటుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలోనే బంగారు దుకాణాలు జనంతో..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 22, 2022 | 7:09 AM

పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతుంది. బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. చాలా మంది తక్కువో, ఎక్కువో బంగారం కొంటుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలోనే బంగారు దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. అయితే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా.. అని ఎదురుచూస్తుంటారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు. మహిళలు అత్యంత ఇష్టపడే వాటిలో బంగారం ఒకటి. తాజాగా నవంబర్‌ 21వ తేదీ ధరలతో పోలిస్తే 22వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కన్పించింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,670 వద్ద నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.52,920 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.48,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,070 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,920 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,970 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,920 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,920 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,920 ఉంది.

వెండి ధర

చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500, ముంబైలో రూ.60,600, ఢిల్లీలో రూ.60,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.60,600, బెంగళూరులో రూ.66,500, హైదరాబాద్‌లో రూ.66,500, విశాఖలో రూ.66,500 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..