Bank News: రూ. 5 లక్షల పర్సనల్‌ లోన్‌కి నెలకు ఎంత ఈఎమ్‌ఐ కట్టాలి.. పూర్తి వివరాలు మీకోసం..

ఉన్నపలంగా రుణం పొందాలనుకునే వారికి పర్సనల్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎలాంటి పూచికత్తు లేకుండా పర్సనల్ లోన్‌ పొందొచ్చు. అయితే దీనికి మీ సిబిల్ స్కోర్‌ కచ్చితంగా మెరుగ్గా ఉండాలి. సంబంధిత బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా మీ శాలరీ, సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా లోన్‌ను..

Bank News: రూ. 5 లక్షల పర్సనల్‌ లోన్‌కి నెలకు ఎంత ఈఎమ్‌ఐ కట్టాలి.. పూర్తి వివరాలు మీకోసం..
Personal Loan
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2022 | 8:45 PM

ఉన్నపలంగా రుణం పొందాలనుకునే వారికి పర్సనల్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎలాంటి పూచికత్తు లేకుండా పర్సనల్ లోన్‌ పొందొచ్చు. అయితే దీనికి మీ సిబిల్ స్కోర్‌ కచ్చితంగా మెరుగ్గా ఉండాలి. సంబంధిత బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా మీ శాలరీ, సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా లోన్‌ను అందిస్తుంటారు. మరి పర్సనల్ లోన్‌ తీసుకుంటే ఎంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు ఎంత ఈఎమ్‌ఐ కట్టాలని చాలా మంది ప్లాన్‌ వేసుకుంటారు. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షల లోన్‌ తీసుకున్నారనుకుంటే 5 ప్రముఖ బ్యాంకుల్లో నెలకు ఎంత ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది. లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌..

దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కేవలం 9.8 శాతం వడ్డీ రేటుతో పర్సనల్ లోన్‌ను అందిస్తోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర..

ఈ బ్యాంక్ తన కస్టమర్లకు చాలా తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని కూడా అందిస్తోంది, మీరు 5 సంవత్సరాలకు 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే, బ్యాంక్ మీకు 8.9 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

యస్‌ బ్యాంక్‌..

యస్‌ బ్యాంక్‌ 5 సంవత్సరాల పాటు 5 లక్షల రుణంపై 10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ లోన్‌ తీసుకున్న కస్టమర్లు నెలకు 10,624 చొప్పున ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ తమ కస్టమర్లకు రూ. 5 లక్షల వ్యక్తిగత రుణాలపై 10.55 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులు నెలకు రూ.10,759 ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తమ కస్టమర్లకు 5 సంవత్సరాలకు 10.2 శాతం వడ్డీ రేటుతో రూ. 5 వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..