SBI WhatsApp Service: ఎస్‌బీఐ కస్టమర్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇక చాలా ఈజీ.. ఈ నెంబర్‌కు “హాయ్” అని మెసెజ్ చేస్తే చాలు.. ఇంకెందుకాలస్యం
వాట్సాప్‌లో కేవలం ఒక మెసెజ్ పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దేశంలోని అతిపెద్ద రుణదాత బ్యాంక్ తన ట్విట్టర్‌లో సమాచారం ఇస్తూ.. ఈ సదుపాయాన్ని..
సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు పెన్షన్ స్లిప్ పొందడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో కేవలం ఒక మెసెజ్ పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. దేశంలోని అతిపెద్ద రుణదాత బ్యాంక్ తన ట్విట్టర్‌లో సమాచారం ఇస్తూ.. ఈ సదుపాయాన్ని సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి.. మీరు 9022690226కు హాయ్ అని టైప్ చేసి మెసెజ్ పంపవలసి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ వాట్సాప్ సౌకర్యం కింద ‘హాయ్’ అని మెసేజ్ చేసిన తర్వాత.. మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో బ్యాలెన్స్ సమాచారం, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ ఉంటాయి. దీని తర్వాత, పెన్షన్ స్లిప్‌పై క్లిక్ చేసి, మీరు పెన్షన్ స్లిప్ పొందాలనుకుంటున్న నెలను ఎంచుకోండి. ఇప్పుడు మీరు కొంతకాలం వేచి ఉండాలి, ఆ తర్వాత మీకు పెన్షన్ స్లిప్ అందించబడుతుంది.
ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్
బ్యాంక్ తన కస్టమర్లకు మరింత ఉపశమనం కలిగించడానికి WhatsAppలో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం కింద, SBI కస్టమర్ బ్యాలెన్స్ సమాచారం నుంచి మినీ స్టేట్‌మెంట్ వరకు సమాచారాన్ని పొందవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాట్సాప్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. దీని కోసం, SBI ఖాతాదారులు 7208933148 నంబర్‌కు ‘WARG’ అనే టెక్స్ట్‌తో స్పేస్ ఇవ్వడం ద్వారా ఖాతా నంబర్‌ను నమోదు చేసి.. SMS పంపాలి. అయితే, మీరు ఖాతా నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా SMS పంపాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ తర్వాత సౌకర్యాలను ఎలా..
అయితే ఎస్పీఐ “హాయ్”లో రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి.. ఎలా పొందాలి, రిజిస్ట్రేషన్ తర్వాత మీకు SBI నంబర్ 90226 90226 నుంచి WhatsApp నంబర్‌లో ఓ మెసెజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ నంబర్‌కు ‘హాయ్’ సందేశాన్ని పంపవచ్చు లేదా మీరు SBI నుంచి వచ్చిన సందేశానికి రీప్లే కూడా ఇవ్వవచ్చు. ఇది కాకుండా, మీరు SBI లోని ఈ సౌకర్యాలను పొందేందుకు ఇచ్చిన సూచనలను అనుసరించవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం