Gold Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
బంగారం, వెండి ధరల్లో రోజు హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. నిన్న ఉన్న ధర నేడు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న ధర రేపు మారవచ్చు. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా..
బంగారం, వెండి ధరల్లో రోజు హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. నిన్న ఉన్న ధర నేడు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న ధర రేపు మారవచ్చు. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ధరలు ఎంత పెరిగినా క్రయవిక్రయాలు మాత్రం ఆగవు. దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 13 (మంగళవారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఆదివారం కొనసాగిన ధరలే సోమవారానికీ కొనసాగుతున్నాయి. వెండి మాత్రం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.
హైదరాబాద్ లో 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం, ₹46,750, 24 క్యారెట్ల బంగారం ₹51,000 గా ఉంది. చెన్నైలో ₹51,760, ముంబయిలో ₹51,000, ఢిల్లీలో ₹51,150, కోల్ కతాలో ₹51,000, బెంగళూరులో ₹51,050, కేరళలో ₹51,000, పుణెలో ₹51,030, వడోదరలో ₹51,030, అహ్మదాబాద్ లో ₹51,050, జైపుర్ లో ₹51,150, లఖ్ నవూలో ₹51,150, కోయంబత్తూరులో ₹51,760, విజయవాడలో ₹51,000, విశాఖపట్నంలో ₹51,000 గా ఉంది.
మరోవైపు.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలోపై ఏరూ.200 పెరిగి 55,200 కు చేరింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర ₹61,400 గా ఉంది. చెన్నైలో ₹61,400. ముంబయిలో ₹55,200, ఢిల్లీలో ₹55,200, విజయవాడలో ₹61,400 గా ఉంది.