Tech News: అలా చేస్తే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త.. కంపెనీ ఎంప్లాయిస్‌కి ఇన్ఫోసిస్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 13, 2022 | 1:56 PM

Moonlighting: కరోనా మహమ్మారి అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చితే కొందరు ఐటీ ఉద్యోగులకు మాత్రం కలిసొచ్చింది. ముఖ్యంగా అనివార్యంగా మారిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఉద్యోగులకు ఎంచక్కా ఇంటి వద్దే ఉంటూ పనిచేసుకునే..

Tech News: అలా చేస్తే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త.. కంపెనీ ఎంప్లాయిస్‌కి ఇన్ఫోసిస్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..
Moonlighting

Moonlighting: కరోనా మహమ్మారి అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చితే కొందరు ఐటీ ఉద్యోగులకు మాత్రం కలిసొచ్చింది. ముఖ్యంగా అనివార్యంగా మారిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఉద్యోగులకు ఎంచక్కా ఇంటి వద్దే ఉంటూ పనిచేసుకునే వెసులుబాటు కలిగింది. అయితే ఈ వెసులుబాటును కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేశారు. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘మూన్‌ లైటింగ్‌’అనే అంశం తెరపైకి వచ్చింది. ఒక కంపెనీలో ఉద్యోగం చూస్తూ మరో కంపెనీ కోసం పనిచేయడాన్ని మూన్‌ లైటింగ్ విధానంగా అభివర్ణిస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఆసరగా చేసుకొని.. ఒక కంపెనీకి తెలియకుండా మరో సంస్థలో పనిచేస్తూ కొందరు ఐటీ ఉద్యోగులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఇలా చేయడం కంపెనీల నిబంధనలకు విరుద్దం. ఒక సంస్థకు చెందిన డేటా మరో కంపెనీకి లీకయ్యే ప్రమాదం ఉండడం వల్ల కంపెనీలు ఈ విధానాన్ని ఎంకరేజ్‌ చేయవు.

ఈ నేపథ్యంలోనే దొంగచాటుగా రెండు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐటీ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పటికే విప్రో చెర్మైన్‌ ప్రేమ్‌ జీ మూన్‌లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, సంస్థ నిబంధనలను ఉల్లగించిన వారిని తొలగించేందుకు కూడా వెనకాడమని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వరుసలో మరో దేశీయ ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చి చేరింది. ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం మూన్‌లైటింగ్ విధానం అనుమతించబోయేది లేదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ ఈమెయిల్స్‌ పంపించింది. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తెలిపింది.

‘నో టూ టైమింగ్‌’, ‘నో మూన్‌లైటింగ్‌’, ‘నో డబుల్‌ లైఫ్‌’ అనే ట్యాగ్‌లైన్‌లతో ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు ఇతర సంస్థలకు చెందిన పనులు చేయకూడదనే సందేశాన్ని ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చే ఆఫర్‌ లెటర్‌లోనే ఇతర కంపెనీల కోసం పనిచేయకూడదనే నిబంధన ఉంటుందని సదరు మెయిల్‌లో ప్రస్తావించారు. ఇలా ఓవైపు ఐటీ కంపెనీలు మూన్‌ లైటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు స్విగ్గీలాంటి కొన్ని కంపెనీలు మాత్రం తమ ప్రయోజనాలకు ఇబ్బంది లేనంత వరకు ఉద్యోగులు ఫ్రీ సమయాల్లో ఇతర కంపెనీల్లో పని చేసుకోవచ్చని తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu