Gold, Silver Imports: డిమాండ్ పడిపోవడంతో దేశంలో తగ్గిన బంగారం, వెండి దిగుమతులు

దేశంలో బంగారం, వెండి దిగుమతులు తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ నెలలో రెండు లోహాల దిగుమతి తగ్గింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య..

Gold, Silver Imports: డిమాండ్ పడిపోవడంతో దేశంలో తగ్గిన బంగారం, వెండి దిగుమతులు
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Nov 27, 2022 | 8:15 PM

దేశంలో బంగారం, వెండి దిగుమతులు తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ నెలలో రెండు లోహాల దిగుమతి తగ్గింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు 17.38 శాతం తగ్గి దాదాపు 24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డిమాండ్ తగ్గుదల కారణంగా ఇది జరిగిందని తెలుస్తోంది. గతేడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

బంగారం, ఆభరణాల ఎగుమతులు పెరిగాయి:

ఇక వెండి దిగుమతులు 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, మొత్తం దిగుమతులు ఏప్రిల్-అక్టోబర్ 2021-22లో $ 1.52 బిలియన్ల నుండి $ 4.8 బిలియన్‌లకు పెరిగాయి. ఏప్రిల్-అక్టోబర్ 2022కి సరుకుల వాణిజ్య లోటు $173.46 బిలియన్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 94.16 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే బంగారం, ఆభరణాల ఎగుమతులు 1.81 శాతం స్వల్ప పెరుగుదలతో 24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జనవరి 2023 నుండి డిమాండ్ పెరగడం ప్రారంభమవుతుంది. ఈ నెలలో కేంద్రం బంగారం, వెండి దిగుమతులను పెంచింది.

బంగారం వినియోగం తగ్గుదల:

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌లో బంగారం వినియోగం ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 25 శాతం తగ్గిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గింది. మరోవైపు, గత నెలలో పెట్టుబడిదారులకు బంగారం నుండి 10 గ్రాములకు సుమారు 2 వేల రూపాయల ప్రయోజనం లభించింది. అక్టోబర్ 26న ఫ్యూచర్స్ మార్కెట్ పది గ్రాములకు రూ.50,687 వద్ద ముగిసింది. వారం చివరి ట్రేడింగ్ రోజున పది గ్రాముల బంగారం ధర రూ.52,544కి తగ్గింది. ఈ సమయంలో పెట్టుబడిదారులు పది గ్రాములపై ​​రూ.1,857 లాభపడ్డారు. గత వారంలో బంగారం ఫ్లాట్ స్థాయిలోనే ఉంది. ఈ వారంలో బంగారం కూడా రూ.53 వేలకు చేరువైంది. మరోవైపు, పెట్టుబడిదారులు గత నెలలో వెండి నుండి కిలోకు రూ.3,500 లాభపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..