Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ వచ్చేస్తోంది.. ఊహించని భారీ ఆఫర్లు..!

Flipkart Big Billion Days Sale: టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసేస్తున్నారు. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు..

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ వచ్చేస్తోంది.. ఊహించని భారీ ఆఫర్లు..!
Flipkart Big Billion Days Sale
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2022 | 7:04 PM

Flipkart Big Billion Days Sale: టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసేస్తున్నారు. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు పండగ సీజన్‌లు వస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో పండగ సీజన్‌ మరింతగా ఊపందుకుంటుంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు ఉండటంతో ఈకామర్స్‌ దిగ్గజాలు భారీ ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్‌ భారీ సెల్‌తో ముందుకు వస్తోంది. అదే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (Big Billion Days Sale). త్వరలో ఈ భారీ సేల్‌ ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్టు తెలిపింది. త్వరలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా ప్రకటించింది. కానీ ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్‌లో బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో ఈ బిగ్‌ సేల్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Flipkart Big Billion Days Sale 2022

 Flipkart Big Billion Days Sale 2022

ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా 40 శాతం నుంచి 80 శాతం వరకు పలు వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు ఉండనుంది. స్మార్ట్‌టీవీలు, రిప్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు, అలాగే హోమ్‌ అప్లయెన్సెస్‌పై ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లు, సౌండ్‌ బార్లు, బ్లూటూత్‌, ఇయర్‌బడ్స్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించిన తర్వాత ప్రైమ్‌ మెంబర్స్‌కు మాత్రం ఒక రోజు ముందుగానే సేల్‌ ప్రారంభం కానుంది. ఆపిల్‌, శాంసంగ్‌, రియల్‌మి, రెడ్‌మి, ఒప్పో, వీవో వంటి ప్రముఖ బ్రాండ్‌లపై భారీ తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..