AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Rule Change: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. ఈ ఐదు అంశాల్లో కొత్త నిబంధనలు అమలు..!

Financial Rule Change: 1 జూన్ 2022 నుండి ఆర్థిక మార్పులు: జూన్ నెల ప్రారంభం కావడానికి ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. జూన్ 1 నుండి మీ జేబుకు చిల్లలు పడనున్నాయి. మీ EMI ..

Financial Rule Change: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. ఈ ఐదు అంశాల్లో కొత్త నిబంధనలు అమలు..!
Subhash Goud
|

Updated on: May 30, 2022 | 3:02 PM

Share

Financial Rule Change: 1 జూన్ 2022 నుండి ఆర్థిక మార్పులు: జూన్ నెల ప్రారంభం కావడానికి ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. జూన్ 1 నుండి మీ జేబుకు చిల్లలు పడనున్నాయి. మీ EMI విషయంలో మీకు మరింత ఖర్చు పెరగనుంది. మీరు వాహనాలకు బీమా చేయడానికి ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. జూన్ 1 నుండి ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి.

  1.  SBI హోమ్ లోన్ EMI ఖర్చుతో కూడుకున్నది . జూన్ 1 నుండి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు SBI నుండి గృహ రుణగ్రహీతల EMI ఖరీదైనది. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి SBI నుండి గృహ రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మునుపటి కంటే ఖరీదైన వడ్డీకి గృహ రుణం పొందుతారు. SBI తన హోమ్ లోన్-లింక్డ్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ని 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి పెంచింది. అయితే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 6.65 శాతం + CRP ఉంటుంది. SBI వెబ్‌సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుండి వర్తిస్తాయి. అంతకుముందు బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR) 6.65 శాతం కాగా, రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 6.25 శాతంగా ఉంది.
  2.  యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలలో మార్పులు: యాక్సిస్ బ్యాంక్ సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లోని సేవింగ్స్ ఖాతాలు, సాలరీ అకౌంట్లలో కనీస ఖాతా బ్యాలెన్స్ పరిమితిని జూన్ 1 నుండి పెంచాలని నిర్ణయించింది. ఈజీ సేవింగ్ అండ్ శాలరీ ప్రోగ్రామ్ ఉన్న ఖాతాల కనీస ఖాతా బ్యాలెన్స్ పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచారు. లేదంటే రూ.లక్ష టర్మ్ డిపాజిట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో లిబర్టీ సేవింగ్స్ ఖాతాలో కనీస ఖాతా నిల్వ పరిమితిని రూ.15,000 నుండి రూ.25,000కి పెంచారు. లేదంటే రూ.25వేలు వెచ్చించాల్సి ఉంటుంది.
  3. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు: మీకు వాహనం ఉంటే మీ ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే జూన్ 1 నుండి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ వర్గాల వాహనాలకు థర్డ్ పార్టీ మోటారు వాహనాల బీమా ప్రీమియంను పెంచింది. ఇది జూన్ 1 నుండి వర్తిస్తుంది. దీంతో కారు, ద్విచక్ర వాహన బీమా ఖరీదు కానుంది. నోటిఫికేషన్‌లో సవరించిన రేటు ప్రకారం.. 1000 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కార్ల ప్రీమియం ఇప్పుడు రూ. 2072 నుండి రూ. 2094 అవుతుంది. 1000 నుండి 1500 సీసీ ఇంజన్ ఉన్న ప్రైవేట్ కార్ల కోసం ప్రీమియం ఇప్పుడు రూ. 3221కి బదులుగా రూ.3416 అవుతుంది. అయితే, 1500 సీసీ కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ కార్లకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలో స్వల్ప తగ్గింపు ఉంది. ఇది రూ.7897 నుండి రూ.7890కి తగ్గుతుంది. అదేవిధంగా 150 నుంచి 350 సీసీ వరకు ఉన్న ద్విచక్ర వాహనాలకు ప్రీమియం రూ.1366గా ఉంటుంది. 350 సీసీ కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలకు ఈ రేటు రూ.2804గా ఉంటుంది.
  4. గోల్డ్ హాల్‌మార్కింగ్: జూన్ 1, 2022 నుండి, రెండవ దశలో మరికొన్ని జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ అమలు కానుంది. రెండో దశలో దేశంలోని 32 కొత్త జిల్లాల్లో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను ప్రారంభించనున్నారు. జూన్ 1 తర్వాత దేశంలోని మొత్తం 288 జిల్లాల్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్‌మార్కింగ్‌తో విక్రయించనున్నారు. మొదటి దశను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జూన్ 23, 2021 నుండి అమలులోకి తెచ్చింది. దేశంలోని 256 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కోసం ఇష్యూయర్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. నిబంధనల ప్రకారం.. ప్రతి నెలా మొదటి మూడు ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్ (AEPS) లావాదేవీలు ఉచితం. ఇందులో AEPS నగదు ఉపసంహరణ, AEPS నగదు డిపాజిట్, AEPS మినీ స్టేట్‌మెంట్ ఉంటాయి. ఉచిత లావాదేవీల తర్వాత, ప్రతి నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్‌పై రూ. 20+ జీఎస్‌టీని విడివిడిగా ఉంటుంది. అయితే మినీ స్టేట్‌మెంట్ లావాదేవీకి రూ. 5 ప్లస్ జీఎస్‌టీ వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి