AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero MotoCorp: బోగస్ ట్రాన్సాక్షన్స్ తో రూ.1000 కోట్ల ఫ్రాడ్.. బ్లాక్ మనీతో ఫామ్ హౌస్ కొనుగోలు..

Hero MotoCorp: భారీ టాక్స్ కుంభకోణంలో దేశంలోనే దిగ్గజ ద్విచక్రవాహన తయారీ సంస్థ పేరు బయటపడింది. రూ.1000 కోట్ల మేర సొమ్ము ఇందులో ఉందని ఐటీ అధికారులు తెలిపారు.

Hero MotoCorp: బోగస్ ట్రాన్సాక్షన్స్ తో రూ.1000 కోట్ల ఫ్రాడ్.. బ్లాక్ మనీతో ఫామ్ హౌస్ కొనుగోలు..
Black Money
Ayyappa Mamidi
|

Updated on: Mar 30, 2022 | 10:04 AM

Share

Hero MotoCorp: భారీ టాక్స్ కుంభకోణంలో దేశంలోనే దిగ్గజ ద్విచక్రవాహన తయారీ సంస్థ పేరు బయటపడింది. రూ.1000 కోట్ల మేర సొమ్ము ఇందులో ఉందని ఐటీ అధికారులు తెలిపారు. హీరో మోటోకార్ప్ ​సంస్థ కార్యాలయాలపై గతవారం టాక్స్ అధికారులు దాడులు(IT Raids) చేసిన విషయం తెలిసిందే. ఈ మెుత్తాన్ని వేర్వేరు అవసరాల కోసం ఖర్చు చేసినట్లు ఆ సంస్థ తప్పుడు లెక్కలు చూపినట్లు(Financial Misappropriation) ఆదాయ పన్నుశాఖ కనుగొంది. దిల్లీ సమీపంలో స్థిరాస్తుల కొనుగోలు కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.100 కోట్లు నగదుతో ఫామ్ హౌస్ కొనేందుకు లావాదేవీలు జరిపినట్లు తేల్చింది. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు జప్తుచేశారు.

హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండీ పవన్ ముంజల్ ఛత్తర్​పుర్​లో ఓ ఫార్మ్​హౌస్​ను లెక్కల్లో చూపని సొమ్ముతో కొనుగోలు చేశారని.. పన్ను ఎగవేసేందుకు మార్కెట్ ధరలో మార్పులు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్- 269 SS ప్రకారం స్థిరాస్థి లావాదేవీల్లో రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరిస్తే శిక్ష ఉంటుంది. అయితే.. ఫామ్​హౌస్​ కోసం రూ.100 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు ఐటీ శాఖ గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో మార్చి 23న హీరో మోటో కార్ప్​ కార్యాయాలపై ఐటీ శాఖ దాడులు చేసింది. ఛైర్మన్ పవన్ ముంజల్​సహా ఇతర అధికారుల నివాసాల్లోనూ సోదాలు జరిపింది. దిల్లీలోని 40కి పైగా కార్యాలయాల్లో మార్చి 26న ఇందులో భాగంగా సోదాలు జరిగాయి. ఐటీ అధికారుల ప్రకటనతో Hero Motor కంపెనీ షేర్లు 7 శాతం మేర పతనమయ్యాయి.

ఇవీ చదవండి..

Senior Citizen Investment Scheme: రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి..

Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..