Financial Alert: అలర్ట్‌.. మిగిలింది రెండే రోజులు.. ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులే..!

Financial Alert: కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ప్రతి ఏడాదిలోనూ మార్చి (March) నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. కొత్త ఆర్థిక..

Financial Alert: అలర్ట్‌.. మిగిలింది రెండే రోజులు.. ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులే..!
Follow us
Subhash Goud

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 12:10 PM

Financial Alert: కొత్త ఏడాది ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ప్రతి ఏడాదిలోనూ మార్చి (March) నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. పాత నిబంధనలు కూడా మారిపోతాయి. ఆ స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి.. ఏప్రిల్ 1 (Aprila) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా.. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కొన్ని పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంట చూద్దాం.

పన్ను మినహాయింపుల కోసం (Tax Saving):

ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80C కింద వర్తించే మినహాయింపులన్నీ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పింఛన్‌, జాతీయ ఫించను స్కీమ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోండి. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌వై స్కీమ్‌లలో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే.. మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెట్టాలి.

రిటర్నుల దాఖలు (Income Tax Returns):

గత ఆర్థిక సంవత్సరంల కంటే 2020-21కు సంబంధించిన రిటర్నులు రుసుముతో సమర్పించేందుకు మార్చి 31 చివరి తేదీ. ఆ తర్వాత రిటర్నులను దాఖలు చేయడం కుదరదు. ఆడిట్‌ పరిధిలోకి వచ్చేవారు మార్చి 15లోగా రిటర్నులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234F ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. జరిమానా పడకుండా ఉండాలంటే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను గడువు తేదీలోగా దాఖలు చేయడం మంచిది.

ఆధార్‌-పాన్‌ లింక్‌ (Pan -Aadhaar Link):

ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలి. గడువు దాటినట్లయితే పాన్‌ చెల్లకుండా పోయే అవకాశం ఉంది. అందుకు ముందస్తుగా ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 272B కింద రూ.10వేల వరకు జరిమానా

కేవైసీ అప్‌డేట్‌ (KYC Update):

మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్‌, ఆధార్‌, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి.

వివాద్‌ సే విశ్వాస్‌ (Vivad se Vishwas)

వివాద్‌ సే విశ్వాస్‌ స్కీమ్‌లో ఏదైనా పన్ను బాకీ ఉంటే చెల్లించుకోవడం మంచిది. దానిని చెల్లింపు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!