Hero MotoCorp: టూ వీలర్‌ కొనుగోలుదారులకు షాక్‌ ఇవ్వనున్న హీరో మోటోకార్ప్.. వచ్చే నెల నుంచి ధరలు పెంపు..

వచ్చే వారం నుంచి హీరో మోటోకార్ప్(Hero motocorp) తన బైక్‌ల ధరలను పెంచబోతోంది. ఏప్రిల్ 5 నుంచి బైక్ ధరలు రూ.2000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది...

Hero MotoCorp: టూ వీలర్‌ కొనుగోలుదారులకు షాక్‌ ఇవ్వనున్న హీరో మోటోకార్ప్.. వచ్చే నెల నుంచి ధరలు పెంపు..
Hero Motocorp
Follow us

|

Updated on: Mar 30, 2022 | 6:45 AM

వచ్చే వారం నుంచి హీరో మోటోకార్ప్(Hero motocorp) తన బైక్‌ల ధరలను పెంచబోతోంది. ఏప్రిల్ 5 నుంచి బైక్ ధరలు రూ.2000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెరుగుదల కారణంగా, ఆటో రంగానికి చెందిన చాలా కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ నెల నుంచి టయోటా(Toyota), ఆడి, బిఎమ్‌డబ్ల్యూ(BMW), మెర్సిడెస్ బెంజ్ తమ వాహనాల ధరలను పెంచబోతున్నాయి. ఈ పెరుగుదల గరిష్ఠంగా రూ. 2000 వరకు ఉంటుంది. ఇది మార్కెట్, మోడల్‌ను బట్టి మారుతుంది.

ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) తన వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 1, 2022 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. వాణిజ్య వాహనాల ధరలను కంపెనీ 2 నుంచి 2.5 శాతం పెంచనుంది. ఈ పెంపు మోడల్, వేరియంట్ ఆధారంగా నిర్ణయిస్తారు. స్టీల్, అల్యూమినియం, ఇతర విలువైన లోహాల ధరలు పెరగడంతోపాటు ఇతర ముడిసరుకు ధరలు పెరగడం వాణిజ్య వాహనాల ధరలు పెంచడానికి కారణమైందని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ గతేడాదిలో కూడా వాణిజ్య వాహనాల ధరలు పెంచింది.

Read Also.. Insurance Alert: గుడ్డిగా తెలిసినవారి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు కొనకండి.. తరువాత ఈ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త..