Insurance Alert: గుడ్డిగా తెలిసినవారి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు కొనకండి.. తరువాత ఈ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త..

Insurance Alert: ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గం ఏమటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కేవలం ఒక్క క్లిక్ తో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు(Insurance aggregators), ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్లు(Brokers) తమ ఉత్పుత్తులను అమ్మేందుకు క్యూ కడతారు.

Insurance Alert: గుడ్డిగా తెలిసినవారి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు కొనకండి.. తరువాత ఈ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త..
Insurance
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 29, 2022 | 2:09 PM

Insurance Alert: ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గం ఏమటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కేవలం ఒక్క క్లిక్ తో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు(Insurance aggregators), ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్లు(Brokers) తమ ఉత్పుత్తులను అమ్మేందుకు క్యూ కడతారు. అతను ఖాతా కలిగి ఉన్న బ్యాంకు సైతం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమంటూ చాలాసార్లు కస్టమర్ ను సంప్రదించింది. అమ్మేవారు ఎక్కువ మంది ఉన్నా.. వారందరూ అమ్ముతున్న ప్రొడక్ట్స్, వాటి ప్రీమియంలలో మాత్రం పెద్దాగా ఎటువంటి మార్పు లేదు. మీరు పాలసీని ఎక్కడి నుండి కొనాలో తెలుసుకోవడం కంటే.. దానిని ఎలా కొనాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. మీరు ఇన్సూరెన్స్ ప్లాన్‌లోని నియమనిబంధనలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. మీరు అవి అర్థంకాకపోతే.. వెంటనే బ్రోకర్‌, ఏజెంట్‌, పాలసీని కొంటున్న ప్లాట్‌ఫారమ్‌ లేదా మధ్యవర్తులను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారి నుంచి మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భవిష్యత్తులో ఊహించని ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తారు. ఒకవేళ ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే.. మీ కుటుంబం ఇన్సూరెన్స్ కవర్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఆసుపత్రిలో చికిత్సకు అయిన ఖర్చులను బరించటం కోసం కూడా ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అందువల్ల.. పాలసీని కొనుగోలు చేస్తున్నప్పుడే క్లెయిమ్ పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని ముందుగానే అడిగి తెలుసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరిని సంప్రదించాలో కూడా పాలసీ కొనేటప్పుడే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో ఏమి చేయాలో తెలుసుకోవటం కోసం.. మీరు ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి వేటి ఉండాల్సిన రాకుండా చూసుకోండి. ఊహించని పరిస్థితులు ఎదురైతే మీరు ఎవరిని సంప్రదించాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి కాబట్టి.. మీరు సరైన స్థలం నుంచి పాలసీని కొనడం చాలా ముఖ్యం.

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తప్పుడు ఇన్సూరెన్స్ పాలసీల అమ్మకానికి సంబంధించి 25,482 ఫిర్యాదులు అందుకుంది. బ్యాంక్ అస్యూరెన్స్ అత్యధికంగా 7,576 పాలసీలను మిస్‌సెల్ చేసినట్లు ఆరోపించింది. బ్రోకర్లపై 5,901, కార్పొరేట్ ఏజెంట్లపై 4,095, వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఏజెంట్లపై 3,799 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 3,102 ఫిర్యాదులు డైరెక్ట్ సెల్లింగ్‌కు సంబంధించినవే. 1,009 ఇతర రకాల ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ పాలసీ మిస్‌సెల్లింగ్‌కు ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం అందిచకపోవటం, ప్రీమియం చెల్లింపు నిబంధనలను తప్పుగా చూపించడం, లోన్ బోనస్‌కు సంబంధించిన తప్పుడు వాగ్దానాలు, పేపర్ వర్క్ పూర్తిచేసేటప్పుడు నకిలీ సంతకం చేయడం, సేల్స్ టార్గెట్లను చేరుకోవటం కోసం బీమా కవర్ పెంచటం వంటి అనేక కారణాలు ఉన్నాయి.

ఒక క్లిక్‌తో ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మే వెబ్‌సైట్లు.. వినియోగదారులకు అనేక ఆప్షన్లు ఉన్నాయని చెబుతున్న సమయంలోనే వాటిలో ఏది ఎంచుకోవాలో తెలియక వారు గందరగోళానికి కూడా గురవుతున్నారని ఒక వెబ్‌సైట్ కు చెందిన అధికారి తెలిపారు. పాలసీకి సంబంధించిన రిస్క్, కవర్ కు సంబంధించి పూర్తి వివరాలను అసలు వినియోగదారులు అర్థం చేసుకున్నారా. అందుకే ఏజెంట్ నుంచి పాలసీని కొనాలని ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు శైలేష్ కుమార్ అన్నారు. సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్ ను ఎంచుకోవటం వల్ల.. కనీసం అత్యవసర సమయాల్లో కస్టమర్ కేర్ సెంటర్ కు కాల్ చేసి వేచి ఉండాల్సిన పని ఉండదు. ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ను ఎంచుకోవటం మంచిది. అందువల్ల స్నేహితులు, బంధువులు సలహాల మేరకు ఏజెంట్‌ను సెలెక్ట్ చేసుకోకండి. మూడేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఏజెంట్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమని శైలేష్ కుమార్ అంటున్నాడు. మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న ఏజెంట్లలో 95 శాతం మంది ఈ పనిని భవిష్యత్తులో వదిలేసే అవకాశం ఉందని ఆయన అంటున్నాడు. ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా పాలసీ హోల్డర్‌ల అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాతే మీరు అంతిమంగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక ఏజెంట్ కేవలం ఒక కంపెనీకి సంబంధించిన పాలసీలను మాత్రమే అమ్ముతుంటాడు. మరిన్ని ఎంపికలు అవసరమైతే.. ఇన్సూరెన్స్ బ్రోకర్ల వద్దకు వెళ్లవచ్చు. బ్రోకర్ నుంచి ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తే మూడు నుంచి నాలుగు బీమా పాలసీలను పోల్చి చూసుకోవటానికి సహాయంగా ఉంటుందని ఇన్ఫినా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌కి చెందిన ఆశిష్ జంబ్ చెబుతున్నారు. దీని వల్ల పాలసీలో ఏదైనా మార్పులు అవసరమైతే బ్రోకర్ దానిని చూసుకుంటారని ఆయన తెలిపారు. మీరు కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్లినప్పుడు మంచి వాటిని ఎంచుకునేందుకు కనీసం రెండు మూడు షాపులు తిరుగుతాం. ఇన్సూరెన్స్ లాంటి ముఖ్యమైన దానిని కొనుగోలు చేసేముందు ఎంచుకోవటం చాలా అవసరం. జీవిత రక్షణ కోసం మీరు పాలసీని కొనాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ గా నిలిచేందుకు ఉపయోగపడే పాలసీని కొనాలి. ఏజెంట్, మీకు పాలసీ అమ్ముతున్న ప్లాట్‌ఫారమ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఎటువంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు.

ఇవీ చదవండి..

Stock Market: మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..

Investment: రిటైర్మెంట్ తరువాత ఏ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి లాభదాయకం?.. పూర్తి వివరాలు..

వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??
వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??