Stock Market: మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..

Stock Market: వారం రెండో రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రారంభ లాభాలతో మార్కెట్లు పాజిటివ్ సెంటిమెంట్ మధ్య ట్రేడింగ్ ప్రారంభించాయి.

Stock Market: మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..
Stock Market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 29, 2022 | 9:42 AM

Stock Market: వారం రెండో రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ సూచీ సెన్సెక్స్(Sensex) 300 పాయింట్లకు పైగా ఆరంభ లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ(Nifty-50) 80 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడ్ అవుతోంది. వీటికి అదనంగా బ్యాంక్ నిఫ్టీ సూచీ 190 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 210 పాయింట్లకు పైగా లాభాలతో పాజిటివ్ ఓపెనింగ్ మధ్య మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఎస్బీఐ లైఫ్, టాటా పవర్, అరబిందో ఫార్మా కంపెనీల షేర్లు ఫోకస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బాబా రామ్ దేవ్ కు చెందిన రుచి సోయా కంపెనీ FPO పెట్టుబడుల విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ FIR నమోదు చేసింది.

నిఫ్టీ సూచీలోని ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.31%, హెట్డీఎఫ్సీ 1.44%, ఏషియా పెయింట్స్ 1.33%, అల్ట్రా టెక్ సిమెంట్ 1.26%, భారతీ ఎయిర్ టెల్ 1.18%, హెచ్పీసీఎల్ 1.11%, మారుతీ సుజుకీ 1.07%, టాటా మోటార్స్ 1.02%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 0.93%, యూపీఎల్ 0.93% పెరిగి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. ఇండస్ టవర్స్ 3.43%, ఓఎన్జీసీ 1.42%, కోల్ ఇండియా 1.31%, డాక్టర్ రెడ్డీస్ 0.51%, హిందాల్కో 0.35%, ఐచర్ మోటార్స్ 0.24%, వేదాంతా 0.23%, ఐటీసీ 0.21%, టాటా స్టీల్ 0.15%, జీ ఎంటర్టైన్ మెంట్ ఎంటర్ ఫ్రైజెస్ 0.14% మేర నష్టపోయి ట్రేడింగ్ ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

40 పైసలు ఎక్కువ‌ చార్జ్ చేశార‌ని కోర్టుకెక్కిన క‌స్ట‌మ‌ర్‌ !! ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా ??

FedEx New CEO: ఫెడెక్స్‌ నూతన సీఈవోగా ఇండియన్ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం