FedEx New CEO: ఫెడెక్స్ నూతన సీఈవోగా ఇండియన్ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం
FedEx New CEO: అమెరికాలోని అనేక దిగ్గజ కంపెనీలకు భారతీయులు సారధ్యం వహిస్తున్నారు. అక్కడి కంపెనీలకు బంగారు బాట వేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
FedEx New CEO: అమెరికాలోని అనేక దిగ్గజ కంపెనీలకు భారతీయులు సారధ్యం వహిస్తున్నారు. అక్కడి కంపెనీలకు బంగారు బాట వేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా.. భారత సంతతికి చెందిన అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం FedEx సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన బహుళజాతి కొరియర్ సర్వీస్(Courier Service) దిగ్గజం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూన్ 1, 2022న పదవీవిరమణ చేయనున్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో ఇండియన్ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం(Raj Subramaniam) బాధ్యతలు స్వీకరిస్తారు. స్మిత్ ఇప్పుడు కంపెనీకి తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారు. రాజ్‌ని తన కొత్త రోల్ లోకి స్వాగతిస్తూ.. “ రాజ్ సుబ్రమణ్యం వ్యాపార నిర్వహణ సామర్ధ్యం ఉన్న నాయకుడని మేము నమ్ముతున్నాము. ఫెడెక్స్‌ను విజయవంతమైన భవిష్యత్తులోకి నడిపిస్తాడని భావిస్తున్నాను ” అంటూ స్మి్త్ అన్నారు. 1971లో స్మిత్ కంపెనీని స్థాపించారు. రానున్న కాలంలో సుబ్రమణ్యం సుస్థిరత, ఆవిష్కరణ, పబ్లిక్ పాలసీ పాటు మరిన్ని అంశాలపై దృష్టి సారిస్తారని స్మిత్ అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన రాజ్ సుబ్రమణ్యం FedEx లాంటి ప్రఖ్యాత కంపెనీలో పనిచేయటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
FedEx సంస్థ ప్రధాన కార్యాలయం టేనస్సీలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. సుబ్రమణ్యం 2020లో ఫెడెక్స్ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యారు. కంపెనీలో ఆయన తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటారని సంస్థ భావిస్తోంది. దీనికి ముందు సుబ్రమణ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ అయిన FedEx Expressకి ప్రెసిడెంట్, CEOగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ముందుగా తన ప్రస్థానాన్ని FedEx కార్ప్‌లో ప్రారంభించారు. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. కార్పొరేట్ వ్యూహకర్తగా ఆయన పనిచేశారు. దీనికి అదనంగా.. కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ అధ్యక్షుడిగా, 1991లో ఫెడెక్స్‌లో చేరినప్పటి నుండి ఆసియా, అమెరికా అంతటా వివిధ విభాగాల్లో ఆయన తన సేవలను కంపెనీ అందించారు. ఇలా కంపెనీ ఎదుగుదలకు తన వంతు పాత్రను విజయువంతంగా సుబ్రమణ్యం పోషించారు.
ఇవీ చదవండి..
Investments: బిజినెస్ సైకిల్ ఫండ్స్ అంటే ఏమిటి..? వాటిలో లాభాలు ఎలా వస్తాయంటే..
Headlines: 5G శకానికి ఎయిర్‌టెల్ సరికొత్త నాంది.. 1983 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్ ప్రతిసృష్టి..