Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

కోడిగుడ్డు(eggs) తినడం ఆరోగ్యానికి మంచిది. అందులో ఉడికించిన కోడిగుడ్డు తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తారు. గుడ్డులోని ప్రోటీన్లు(proteins) శరీరానికి మేలు చేస్తాయి...

Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
ఉడకబెట్టిన గుడ్డు: మీరు నాన్-వెజ్‌ని ఇష్టపడితే.. ఉడికించిన గుడ్డు కూడా చాలా మంచిది. ఉడికించిన గుడ్లు ఆకలిని శాంతపరుస్తాయి. అందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి.
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 30, 2022 | 6:30 AM

కోడిగుడ్డు(eggs) తినడం ఆరోగ్యానికి మంచిది. అందులో ఉడికించిన కోడిగుడ్డు తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తారు. గుడ్డులోని ప్రోటీన్లు(proteins) శరీరానికి మేలు చేస్తాయి. వేసవి, వర్షాకాలం, చలికాలం అని తేడా లేకుండా ఎప్పుడైనా ఉడికించిన గుడ్డును తినొచ్చు. అయితే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని మీకు తెలుసా? అలా ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు తినడం వల్ల డయాబెటిస్( Diabetes) రిస్క్ 60 శాతం పెరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడయింది.

చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వేలో పాల్గొన్న 8,000 మందికి పైగా గుడ్లు తినే వారిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుందని తేలింది. సీరమ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో నిర్ధరణ అయింది. శరీరంలో అధిక కొవ్వు, జంతు ప్రొటీన్లు తీసుకున్నట్లు పరిశోధనలో తేలింది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్ ఆక్సీకరణను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే రసాయనాల నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తుంది. అయితే ప్రపంచంలో అనేక మంది ఉడికించిన కోడిగుడ్డును అల్పాహారాల్లో భాగంగా తీసుకుంటున్నారు. గుడ్డులో అధిక ప్రోటీన్లు ఉన్నాయి.

అలా కోడిగుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఒక కోడిగుడ్డులో 200 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు హానీ కలుగజేస్తుందని అధ్యయనంలో తేలింది. కోడిగుడ్లను ఉడకబెట్టి.. వాటిపై ఉప్పు, మిరియాలు, కొత్తిమీర ఆకులతో సర్వ్ చేయడం లేదా రెండు గుడ్లను ఉపయోగించి.. ఆఫ్ బాయిల్డ్ లాగా తినడం చాలా శరీరానికి మేలు కలుగుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.

Read Also..  Smoking: ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..?