Smoking: ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..?

Smoking: ధుమపానం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ దానిని మాత్రం మానరు. . ధూమపానం (Smoking) ఎక్కువ అలవాటు..

Smoking: ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..?
Smoking
Follow us
Subhash Goud

|

Updated on: Mar 29, 2022 | 11:34 AM

Smoking: ధుమపానం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ దానిని మాత్రం మానరు. . ధూమపానం (Smoking) ఎక్కువ అలవాటు ఉన్నవారికి.. దాన్ని విడిచిపెట్టడం అంత తేలికైన పని కాదు. నికోటిన్‌  (Nicotine) వ్యసనం నుంచి విముక్తి పొందడమే పెద్ద సవాలు అని చెప్పాలి. దీని వల్ల ఆరోగ్యానికి (Health) ఎంతో హానికరం. ఊపిరితిత్తులతో సహా శరీరంలో అన్ని భాగాలపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు కూడా ముందుగా సిగరేట్‌ తాగడం మానేయాలని సూచిస్తుంటారు. ఇక ధూమపానం మానేసినప్పుడు మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి సిగరేట్‌ తాగడం మానేస్తే శరీరంలో ఎన్ని మార్పులు ఉంటాయి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

సిగరేట్‌ మానేసిన 8 గంటల తర్వాత..

చివరిగా మీరు సిగరేట్‌ మానేసిన 8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్‌ మరియు కార్బన్‌ మోనాక్సైడ్‌ పరిమాణం తగ్గుముఖం పడుతుంది. కానీ సగం వరకు ఇంకా ఉంటుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌ అనేది శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తొలగించే రసాయనం. దీని కారణంగా సిగరేట్‌ తాగేవారికి కండరాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అదే సమయంలో 8 గంటల తర్వాత మీరు సిగరేట్‌ తాగేందుకు చాలా కోరికలు కలుగుతాయి. ఒక సమయంలో 5-10 నిమిషాలు సిగరేట్‌ తాగాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. దీని కోసం చూయింగమ్‌ మొదలైనవి నమలడం వల్ల ధూమపానం కోరిక నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

12 గంటల తర్వాత..

మీరు సిగరేట్‌ మానేసిన 12 గంటల తర్వాత శరీరంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. శరీరంలో ఒకమైన మార్పు వస్తుంది. గుండె పని తీరులో మార్పు వస్తుంది. ఎందుకంటే గుండె ఆక్సిజన్‌ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు.

ఒక రోజు తర్వాత..

మీరు రోజుకు ఒక ప్యాక్‌ స్మోక్‌ చేస్తే మీరు ధూమపానం చేయని వారి కంటే గుండెపోటు వచ్చే అవకాశం రెండింతలు ఉంటుంది. ఒక రోజంతా సిగరేట్‌ లేకుండా బయటకు వెళితే మీరు మెల్లమెల్లగా ధూమపానం మానేసే విధంగా చేసుకోవచ్చు. మీరు సిగరేట్‌ మానేసిన తర్వాత అంటే రెండు రోజుల తర్వాత మీ శరీరంలో మార్పులు ఉంటాయి. మీ నరాల చివరలు నయం కావడానికి చర్య ప్రారంభం అవుతుంది. మరో వైపు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. అదే సమయంలో నికోటిన్‌ కూడా ఉండకుండా చేస్తుంది. ఈ సమయంలో విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం, ఆకలిగా లేదా అలసటగా ఉండటం అనేవి సర్వసాధారణం. చాలా మందికి తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభం అవుతుంది.

2 వారాల నుంచి 3 నెలల వరకు..

మీరు సిగరేట్‌ మానేసిన తర్వాత మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. సిగరేట్‌ మానేసిన 2 వారాల నుంచి 3 నెలల్లో ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. దీంతో మీరు వ్యాయమం చేయడం వల్ల మీ శరీరంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ఏడాది తర్వాత..

మీరు సిగరేట్‌ మానేసిన ఏడాది తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి పైగా తగ్గిపోతుంది. దీని వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Plastic Utensils: ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు!

Blood Pressure: బీపీ బాధితులకు అలర్ట్.. టీ తాగుతున్నారా..? ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!